
యూరియా పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
సూర్యాపేటటౌన్ : రైతులకు సరైన సమయంలో యూరియా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా కొరత పట్ల రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై, కాళేశ్వరం ప్రాజెక్టుపై కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు. శుక్రవారం ఆయన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. బీఆర్‌ఎస్ హయాంలో యూరియా కొరత లేదని, రైతులకు సకాలంలో సరిపడా యూరియా అందించామన్నారు. కాంగ్రెస్ పార్టీ మంత్రులే యూరియా లేదటుంటే.. సీఎం రేవంత్ మాత్రం సరిపడా ఉందని అబద్ధం చెపుతున్నారన్నారు. 2014 కు ముందు నీళ్లకోసం కొట్టుకున్నోళ్లు.. నేడు యూరియా కోసం కొట్టుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. హాస్టళ్లల్లో భోజనం సరిగా లేదని పిల్లలే ధర్నా చేసే పరిస్థితి ఏర్పడిందన్నారు. రేవంత్ రెడ్డికి ప్రభుత్వాన్ని నడపడం చేతకావడం లేదని ఆరోపించారు. ఒకపక్క వందల టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తుంటే.. నల్లగొండ గడ్డపైన ఉన్న ఎస్‌ఎల్‌బీసీ ఉదయ సముద్రం ఎండిపోతుందన్నారు. ఎప్పటికై నా కోమటిరెడ్డి, సీఎం రేవంత్‌లు బీజేపీలో చేరేవాళ్లేనని విమర్శించారు.
ఫ మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి