
తిరుమల తరహాలో యాదగిరి క్షేత్రం అభివృద్ధి కావాలి
యాదగిరిగుట్ట: తిరుమల తిరుపతి వెంకటేశ్వరస్వామి ఆలయ తరహాలో యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆలయ ఈవో వెంకట్రావ్‌కు సూచించారు. శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని ఈవో వెంకట్రావ్ మర్యాద పూర్వకంగా కలిశారు. యాదగిరి క్షేత్రానికి ఈవోగా తనను కొనసాగిస్తున్నందుకు సీఎం రేవంత్‌రెడ్డికి వెంకట్రావ్ కృతజ్ఞతలు తెలిపి, శ్రీస్వామి వారి లడ్డూ ప్రసాదం, శేష వస్త్రాన్ని అందజేశారు. యాదగిరిగుట్ట ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు, ఉత్తర్వులను తీసుకోవాలని సీఎం సూచించారు.
ఫ ఈవో వెంకట్రావ్‌కు సూచించిన సీఎం రేవంత్‌రెడ్డి