
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రామన్నపేట: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన రామన్నపేట మండలం వెల్లంకి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ గురువారం రాత్రి మృతి చెందాడు. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వెల్లంకి గ్రామానికి చెందిన నకిరేకంటి మహేష్(40) ఫొటోగ్రాఫర్‌గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం పని నిమిత్తం తన ద్విచక్రవాహనంపై రామన్నపేటకు బయలు దేరాడు. సిరిపురం గ్రామశివారులో వెనుక నుంచి కారు అతివేగంగా వచ్చి ఢీ కొట్టడంతో మహేష్ రోడ్డుపై పడిపోగా తలకు తీవ్ర గాయాలయ్యాయి. అదే గ్రామానికి చెందిన యువకుడు 108కు, కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. రామన్నపేట ప్రభు త్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి, అక్కడి నుంచి నిమ్స్‌కు తరలించారు. చికిత్స పొందుతూ అదేరోజు రాత్రి మృతిచెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నాగరాజు తెలిపారు.