
లక్కుంటే.. పట్టుచీర
భూదాన్‌పోచంపల్లి : పోచంపల్లిలోని కొండాలక్ష్మణ్ బాపూజీ వీవర్స్ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో భక్తులను ఆకర్షించేందుకు నిర్వాహకులు లక్కీ డ్రా కూపన్లు పెట్టారు. రూ.100 చెల్లించి కూపన్ తీసుకొంటే గణేష్ నిమజ్జనం రోజున లక్కీ డ్రా ద్వారా మొదటి బహుమతి కింద రూ.22వేల పోచంపల్లి ఇక్కత్ పట్టుచీర, రెండవ బహుమతి రూ.15వేల పట్టుచీర, మూడవ బహుమతి రూ.7,800 పట్టుచీరతో పాటు మరో 20 మందికి రూ.2వేల విలువ చేసే మస్‌రైజ్డ్ చీరలను అందజేస్తామని ఏకేఎల్‌బీ వీవర్స్ మార్కెట్ అధ్యక్షుడు గుండు శ్రీరాములు తెలిపారు.