
యూరియా పంపిణీలో రాష్ట్రం విఫలం
సాక్షి, యాదాద్రి: అవసరాల మేరకు కేంద్రం యూరి యా సరఫరా చేసినా రైతులకు పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్షుడు ఉట్కూరి అశోక్‌గౌడ్ విమర్శించారు. ప్రజా సమస్యలు, యూరియా కొరతను నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యూరియా చీకటిబజారుకు తరలి పోతున్నా రాష్ట్ర ప్రభుత్వం చూసీ చూడనట్లు వ్యవహిరిస్తుందన్నారు. ఫలితంగా యూరియా కొరత ఏర్పడి రైతులు పంపిణీ కేంద్రాల వద్ద పడిగాపులు కాయల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. బస్వాపూర్ రిజర్వాయర్ ముంపు బాధితులకు పరిహారం ఇవ్వడంలోనూ జాప్యం చేస్తుందన్నారు. మూసీ పునరుజ్జీవం చేయాలని, మూసీతోపాటు వాగులపై హైలెవల్ వంతెనలు నిర్మించాలని, గంధమల్ల రిజర్వాయర్‌ను త్వరితగతిన పూర్తిచేసి ఆలేరు నియోజకవర్గానికి సాగు నీరందించాలని డిమాండ్ చేశారు. భువనగిరిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఏర్పాటు చేయాలని, మదర్ డైయిరీ రైతులకు పాల బిల్లులు విడుదల చేయాలని, కంపెనీల్లో స్థానికులకే ఉద్యోగాలివ్వాని పేర్కొన్నారు. అనంతరం అదనపు కలెక్టర్ వీరారెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా మాజీ అధ్యక్షుడు పాశం భాస్కర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గూడూరు నారా యణరెడ్డి, నాయకులు చందుపట్ల వెంకటేశ్వర్‌రావు, వేముల అశోక్, యెన్నం శివకుమార్, రచ్చ శ్రీనివాస్, గూడూరు జైపాల్‌రెడ్డి, సుర్వి శ్రీనివాస్, చందామహేందర్‌గుప్తా, కాదూరి అచ్చయ్య, రత్నపురం బలరాంమాధురిచంద్ర, వైజయంతి, మణికంట, ఉడుత భాస్కర్, బట్టు క్రాంతి,పట్నం కపిల్, ఆకుతోట రా మకృష్ణ, ఎండీ మహమూద్, గంగేష్ పాల్గొన్నారు.
ఫ కలెక్టరేట్ ఎదుట బీజేపీ మహాధర్నా