
పల్లె ఓటర్ల్లు 5.32లక్షలు
మండలాల వారీగా మొత్తం గ్రామ పంచాయతీ ఓటర్ల వివరాలు
సాక్షి, యాదాద్రి : గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి వార్డుల వారీగా తుది ఓటరు జాబితా, పోలింగ్ కేంద్రాల జాబితాను మంగళవారం జిల్లా పంచాయతీ అధికారులు ప్రకటించారు. గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల వద్ద ఈ జాబితాలను నోటీస్ బోర్డుపై ప్రదర్శించారు. ఈ జాబితా ప్రకారం.. జిల్లాలోని 17 మండలాల్లో గల 427 గ్రామ పంచాయతీల్లో 5,32,240 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో పురుషులు 2,64,577 మంది ఉండగా.. మహిళలు 2,67,661 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 3,084 మంది అధికంగా ఉన్నారు. అన్ని గ్రామ పంచాయతీల్లో 3,704 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా.. గత 2019 గ్రామ పంచాయతీ ఎన్నికల కంటే ఈ సారి 1,18,089 మంది ఓటర్లు పెరిగారు.
గుండాల మండలంతో కలిపి..
గత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో గుండాల మండలం జనగామ జిల్లాలో ఉంది. అప్పుడు జిల్లాలోని 16 మండలాల్లో 401 గ్రామ పంచాయతీలకే ఎన్నికలు జరిగాయి. 3,92,157 మంది ఓటర్లు ఉన్నారు. తర్వాత ప్రభుత్వం గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలో కలిపింది. 20 గ్రామ పంచాయతీలు కలవడంతో గ్రామ పంచాయతీల సంఖ్య 421కి చేరింది. దీంతో ఓటర్ల సంఖ్య 3,92,157నుంచి 4,14,151కి పెరిగింది.
ముసాయిదా కంటే స్వల్పంగా పెరిగిన ఓటర్లు
ముసాయిదా ఓటరు జాబితా కంటే 22 ఓట్లు పెరిగాయి. ముసాయిదా జాబితా ప్రకారం ఓటర్ల సంఖ్య 5,32,218 కాగా ఇందులో పురుషులు 2,64,567, సీ్త్రలు 2,67,649, ఇతరులు ఇద్దరు ఉన్నారు. అభ్యంతరాల స్వీకరణ అనంతరం మొత్తం ఓటర్లు 5,32,240కు చేరింది.
మండలాలు : 17
గ్రామ పంచాయతీలు : 427
మొత్తం ఓటర్లు : 5,32,240
పురుషులు : 2,64,577
మహిళలు: 2,67,661
ఇతరులు : 02
పోలింగ్ కేంద్రాలు : 3,704
మండలం పురుషులు సీ్త్రలు మొత్తం పోలింగ్
కేంద్రాలు
అడ్డగూడూరు 11,320 11,702 23,022 150
ఆలేరు 10,501 11,036 21,537 140
ఆత్మకూర్ 12,890 12,643 25,533 192
భువనగిరి 19,592 20,062 39,654 294
బీబీనగర్ 21,299 21,577 42,876 284
బొమ్మలరామారం 14,631 14,872 29,503 284
పోచంపల్లి 13,733 13,764 27,497 192
చౌటుప్పుల్ 19,096 19,405 38,501 236
గుండాల 13,152 12,917 26,069 182
మోటకొండూరు 10,495 10,608 21,103 170
మోత్కూర్ 6,528 6,687 13,215 88
నారాయణపురం 20,151 19,692 40,113 260
రాజాపేట 14,972 15,264 30,236 206
రామన్నపేట 22,684 22,674 45,358 232
తుర్కపల్లి 13,846 14,131 27,977 266
వలిగొండ 26,030 26,401 52,431 330
యాదగిరిగుట్ట 13,657 13,958 27,615 198
మొత్తం 2,64,577 2,67,661 5,32,240 3704
ఫ గ్రామ పంచాయతీ తుది ఓటరు జాబితా విడుదల
ఫ పెరిగిన 1,18,089 మంది ఓటర్లు
ఫ పోలింగ్ కేంద్రాలు 3,704