హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ ఆత్మకూర్‌(ఎం)కు అటాచ్‌ | - | Sakshi
Sakshi News home page

హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ ఆత్మకూర్‌(ఎం)కు అటాచ్‌

Sep 3 2025 5:10 AM | Updated on Sep 3 2025 5:10 AM

హెడ్‌

హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ ఆత్మకూర్‌(ఎం)కు అటాచ్

చౌటుప్పల్‌ : వినాయక నిమజ్జనాన్ని పురస్కరించుకుని డీజే సౌండ్‌ సిస్టమ్‌ను కారణంగా చూపించి ఉత్సవాల నిర్వాహకుల వద్ద పోలీస్‌ సిబ్బంది డబ్బులు వసూలు చేయడంతో గణేషా... గస్తీ గాడి తప్పింది శీర్షికన మంగళవారం సాక్షి దినపత్రికలో కథనం ప్రచురించింది. ఈ కథనానికి ఏసీపీ పటోళ్ల మధుసూదన్‌రెడ్డి స్పందించారు. అందుకు సంబంధించి విచారణ జరిపించారు. వాస్తవం అని తేలడంతో ఆరోజు సాయంత్రం విధుల్లో ఉన్న హెడ్‌కానిస్టేబుల్‌ రాంబాబుతోపాటు కానిస్టేబుల్‌ వెంకన్నను ఆత్మకూర్‌(ఎం) పోలీస్‌స్టేషన్‌కు అటాచ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సాక్షి కథనం పట్ల వినాయక ఉత్సవాల నిర్వాహకులు, వివిధ యువజన సంఘాల ప్రతినిధులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.

విద్యార్థులకు

రాగిజావ పంపిణీ

భువనగిరి: పోషక విలువతో కూడిన రాగిజావను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ సత్యనారాయణ అన్నారు. మంగళవారం భువనగిరి పట్టణంలోని బీచ్‌మహల్లా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సత్యసాయి అన్నపూర్ణ ట్రస్ట్‌ సహకారంతో రాగిజావను ఆయన అందజేశారు. గత సంవత్సరం మాదిరిగానే విద్యార్థులకు రాగిజావ అందించనున్నట్లు తెలిపారు. అనంతరం డాక్టర్‌ లక్ష్మీనారాయణ విద్యార్థులకు గ్లాసులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంఈఓ నాగవర్ధన్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు భాస్కర్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సేవలను సద్వినియోగం చేసుకోవాలి

భువనగిరి : ప్రత్యేక అవసరాల గల విద్యార్థుల తల్లిదండ్రులు ప్రత్యేక విద్యా బోధకుల సేవలను సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ సత్యనారాయణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 22మంది ప్రత్యేక విద్యా బోధకులు ఉన్నట్లు తెలిపారు. జిల్లాలో ప్రత్యేక విద్యా బోధకులు పనిచేసే ప్రాంతాల్లో ప్రత్యేక అవసరాల విద్యార్థులతో పాటు సంబంధిత కాంప్లెక్స్‌ పరిధిలోని విద్యార్థులకు ప్రత్యేక విద్యా బోధన చేయనున్నట్లు తెలిపారు.

మానసిక సామర్థ్యాలను గుర్తించి ప్రోత్సహించాలి

భూదాన్‌పోచంపల్లి : పిల్లల్లో మానసిక సామర్థ్యాలను గుర్తించి వారిని పోత్సహిస్తే వారిలో ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుందని తెలంగాణ సైకలాజికల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మైండ్‌పవర్‌ స్పెషలిస్ట్‌, ప్రముఖ సైకలాజిస్ట్‌ డాక్టర్‌ ఎం.ఏ కరీం అన్నారు. మంగళవారం భూదాన్‌పోచంపల్లి పట్టణ కేంద్రంలోని జేవీ ఫంక్షన్‌హాల్‌లో మనో వైజ్ఞానిక, మానసిక వికాసంపై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల్లో అభ్యసన వైకల్యాల నిరోధానికి వారి మనస్సును మెప్పించే వినోదంతో కూడిన చదువును అందించాలన్నారు. అనంతరం అంతర్జాతీయ మెజీషియన్‌ రామకృష్ణ నిర్వహించిన మ్యాజిక్‌ పిల్లలను విశేషంగా ఆకట్టుకుంది. అనంతరం మెమొరీ కాంటెస్ట్‌లో ప్రతిభకనబర్చిన విద్యార్థులకు మెరిట్‌ సర్టిఫికెట్లు అందజేశారు.

క్షేత్రపాలకుడికి

నాగవల్లి దళార్చన

యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఉన్న ఆంజనేయస్వామికి అర్చకులు మంగళవారం ఆకుపూజను విశేషంగా నిర్వహించారు. ప్రధానాలయంతో పాటు విష్ణు పుష్కరిణి వద్ద, పాతగుట్ట ఆలయంలో స్వామివారిని సింధూరంతోపాటు, పాలతో అభిషేకించారు. అనంతరం నాగవల్లి దళార్చన చేపట్టారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొన్నారు. ఇక శ్రీసుదర్శన నారసింహ హోమం, గజవాహన సేవ, నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం జరిపించి, సాయంత్రం వెండి జోడు సేవ పూజలు కొనసాగాయి.

హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ ఆత్మకూర్‌(ఎం)కు అటాచ్1
1/2

హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ ఆత్మకూర్‌(ఎం)కు అటాచ్

హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ ఆత్మకూర్‌(ఎం)కు అటాచ్2
2/2

హెడ్‌కానిస్టేబుల్‌, కానిస్టేబుల్‌ ఆత్మకూర్‌(ఎం)కు అటాచ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement