
రోగులకు మెరుగైన సేవలందించాలి
భువనగిరి: రోగులకు మెరుగైన వైద్య సేవలందించాలని కలెక్టర్ హనుమంతరావు అన్నారు. మంగళవారం భువనగిరి మండలంలోని అనాజీపురం గ్రామంలో పల్లె దవాఖానాను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అంతకుముందు ఆస్పత్రిలో రికార్డులు పరిశీలించారు. ఆస్పత్రికి వస్తున్న రోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట ఎంఎల్‌హెచ్‌పీ విజయ, కస్తూరి, గ్రామ పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది ఉన్నారు.
ఫ కలెక్టర్ హనుమంతరావు