
రేషన్ దుకాణాల్లో నిల్వఉన్న సన్నబియ్యం : 1700 మెట్రిక్
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు దొడ్డుబియ్యం వేలానికి చర్యలు
సాక్షి, యాదాద్రి : రేషన్ దుకాణాల్లో దొడ్డు బియ్యం ముక్కిపోతున్నాయి. ఈ ఏడాది మార్చి వరకు లబ్ధిదారులకు దొడ్డు బియ్యం పంపిణీ చేయగా.. ఏప్రిల్ నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. అంతకుముందు రేషన్ దుకాణాలకు సరఫరా చేసిన దొడ్డుబియ్యం ఐదు నెలలుగా వృథాగా ఉంటున్నాయి. దీంతో చాలా చోట్ల ఈ బియ్యం పురుగులు పట్టి, తుట్టెలు కడుతున్నాయి. వీటికి తోడు వివిధ కారణాలతో సన్న బియ్యం తీసుకోని వారివి కూడా రేషన్ దుకాణాల్లో నిల్వ ఉండడంతో వాటికి కూడా పురుగులు పట్టే పరిస్థితి ఏర్పడింది.
కొందరు బియ్యం తీసుకోకపోవడంతో..
జిల్లా వ్యాప్తంగా ఉన్న 515 రేషన్ దుకాణాల్లో దొడ్డుబియ్యం, సన్న బియ్యం నిల్వలు ఉన్నాయి. సన్న బియ్యం 1700 మెట్రిక్ టన్నులు, దొడ్డుబియ్యం 700 మెట్రిక్ టన్నులు ఉన్నాయి. మూడు నెలల అనంతరం బియ్యం తీసుకోవడానికి రేషన్ దుకాణాలకు వచ్చిన లబ్ధిదారులకు తుట్టెలు కట్టిన, లక్కపురుగులు పట్టిన బియ్యం కనిపించాయి. అయితే జూన్, జూలై, ఆగస్టు మూడు నెలల బియ్యం జూన్‌లోనే ప్రభుత్వం రేషన్ దుకాణాలకు సరఫరా చేసింది. అయితే కొందరు లబ్ధిదారులు గ్రామాల నుంచి వలసపోయారు. మరికొందరు వివిధ కారణాలతో బియ్యం తీసుకోలేదు. ప్రధానంగా తుర్కపల్లి, బొమ్మలరామారం, రాజాపేట, నారాయణపురం, చౌటుప్పల్, బీబీనగర్ తదితర ప్రాంతాల ప్రజలు హైదరాబాద్‌కు వలసపోయారు. వారు నివాసం ఉంటున్న చోటనే ఈ పాస్ ద్వారా అక్కడేరేషన్ తీసుకున్నారు. దీంతో ఆయా గ్రామాల్లో వారి పేరున వచ్చిన రేషన్ డీలర్ వద్దే మిగిలిపోయింది. దీంతో పాత బియ్యం, కొత్త బియ్యం పురుగుల పాలవుతున్నాయి.
జిల్లాలో నిల్వ ఉన్న దొడ్డు బియ్యం వేలం వేయడానికి కమిషనరేట్ స్థాయిలో చర్యలు జరుగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా రేషన్‌దుకాణాలు, గోదాములు, ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద 1600 మెట్రిక్ టన్నుల దొడ్డుబియ్యం, 1700 మెట్రిక్ టన్నుల సన్నబియ్యం క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. కమిషనరేట్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు దొడ్డు బియ్యం వేలానికి చర్యలు తీసుకుంటాం.
– హరికృష్ణ, సివిల్ సప్లై డీఎం
ఫ ఐదు నెలలుగా రేషన్‌దుకాణాల్లో
నిల్వ ఉంటున్న దొడ్డు బియ్యం
ఫ తుట్టెలు కట్టి పనికిరాకుండా పోతున్న బియ్యం
ఫ వేలం వేసేందుకు చర్యలు
చేపట్టని అధికారులు
ఫ సన్నబియ్యానికి కూడా
చేరుతున్న పురుగులు
బఫర్ గోదాముల్లో ఉన్న దొడ్డుబియ్యం : 347 మెట్రిక్ టన్నులు
రేషన్ దుకాణాల్లో ఉన్న దొడ్డుబియ్యం : 700 మెట్రిక్ టన్నులు
ఎంఎల్‌ఎస్ పాయింట్లలో ఉన్న దొడ్డుబియ్యం : 181 మెట్రిక్ టన్నులు
దొడ్డు బియ్యం ఖాళీ చేయకుండానే..
జిల్లాలోని రేషన్‌దుకాణాలు, ఎంఎల్‌ఎస్ పాయింట్లు, గోదాముల్లో 1600 మెట్రిక్ టన్నుల దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. ప్రభుత్వం దొడ్డు బియ్యం ఆయా చోట్లనుంచి ఖాళీ చేయకుండానే సన్న బియ్యం స్టాక్ పెట్టింది. ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి రేషన్ దుకాణాలకు వస్తున్న సన్నబియ్యంతో అప్పటికే నిల్వ ఉన్న దొడ్డుబియ్యం నుంచి పురుగులు సన్న బియ్యానికి పడుతున్నాయి.

రేషన్ దుకాణాల్లో నిల్వఉన్న సన్నబియ్యం : 1700 మెట్రిక్

రేషన్ దుకాణాల్లో నిల్వఉన్న సన్నబియ్యం : 1700 మెట్రిక్