పనులొదిలి.. బారులుదీరి | - | Sakshi
Sakshi News home page

పనులొదిలి.. బారులుదీరి

Sep 2 2025 7:40 PM | Updated on Sep 2 2025 7:40 PM

పనులొదిలి.. బారులుదీరి

పనులొదిలి.. బారులుదీరి

ఖాళీ చేతులతో తిరిగి వెళ్లిన

పోలీస్‌ పహారాలో పంపిణీ

సాక్షి, యాదాద్రి: యూరియా కోసం రైతులకు

అవస్థలు తప్పడం లేదు. ఆత్మకూర్‌(ఎం), గుండాల, మోత్కూర్‌, బొమ్మలరామారం, రాజా పేట, రామన్నపేట, అడ్డగూడూరు, భూదాన్‌పోచంపల్లి సొసైటీలకు ఆదివారం తెల్ల వారుజాము నుంచే రైతులు తరలివచ్చారు. పోలీస్‌ పహారాలో యూరియా పంపిణీ చేశారు. ఎకరాకు బస్తా చొప్పున అందజేశారు. ఇంకా రెండు వేల మెట్రిక్‌ టన్నుల యూరియా వస్తే గట్టెక్కుతామని అధికారులు అంటున్నారు. పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో రైతులంతా ఒకేసారి పంట చేలకు యూరియా పెడుతుండటంతో డిమాండ్‌ పెరిగినట్లు చెబుతున్నారు.

క్యూలో చెప్పులు ఉంచి నిరీక్షణ

సొసైటీలకు సరిపడా యూరియా రాకపోవడంతో రైతులకు అవస్థలు తప్పడం లేదు. వారం రోజులుగా సరఫరా కాకపోవడం, కొన్ని సొసైటీలకు ఆదివారం సాయంత్రం యూరియా వచ్చిందన్న సమాచారంతో రైతులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. పొద్దస్తమానం నిరీక్షించినా కొందరికే లభించింది. ఆత్మకూర్‌ సొసైటీకి లారీ లోడ్‌ రాగా.. అందులో సగం గుండాల సొసైటీకి పంపించారు. అడ్డగూడూరు పీఏసీఎస్‌ కార్యాలయం వద్ద రైతులు చెప్పులు, బస్తాలను క్యూలో ఉంచి యూరియా ఇచ్చే వరకు పడిగాపులు కాశారు.

పంటల సాగు, వచ్చిన యూరియా

జిల్లాలో 4,40,500 ఎకరాల్లో పంటలు సాగు కానున్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేయగా సెప్టెంబర్‌ 1నాటికి 4,00,138 ఎకరాల్లో పంటలు వేశారు. ఇందులో అత్యధికంగా వరి 2,54,554, ఆ తరువాత పత్తి 1,13,193 ఎకరాల్లో సాగయ్యాయి. సీజన్‌ ప్రారంభం నుంచి ఇప్పటి వరకు 18,769 మెట్రిక్‌ టన్నులు యూరియా వచ్చింది.

ఎనిమిది ఎకరాల్లో పంటలు సాగు చేశాం. ప్రస్తుతం పెరిగే దశలో ఉన్నాయి. వర్షాలు కురుస్తుండటంతో యూరియా అత్యవసరం అయ్యింది. పీఏసీఎస్‌ కార్యాలయానికి రెండుసార్లు వచ్చినా ఒక్క సంచి కూడా దొరకలేదు. యూరియా వచ్చిందని తెలియడంతో సోమవారం కూడా సహకార సంఘం బ్యాంకుకు వచ్చి ఉదయం నుంచి సాయంత్రం వరకు లైన్‌లో నిల్చున్నా. చివరికి ఖాళీ చేతులతోనే తిరిగి వెళ్లిన.

–జాగిలాపురం సత్తయ్య, పల్లెపహాడ్‌

మోత్కూరు మండలం దత్తప్పగూడెం గ్రామానికి చెందిన మామిడి నరసయ్య ఎకరంన్నర వరి, తొమ్మిది ఎకరాల్లో పత్తి సాగు చేశాడు. పంట పూత దశలో ఉంది. కొంతకాలంగా వర్షాలు కురుస్తుండటంతో యూరియా కోసం రెండు పర్యాయాలు మోత్కూరు సింగిల్‌ విండో గోదాముకు వచ్చాడు. వచ్చిన ప్రతీసారి అతనికంటే ముందు సీరియల్‌లో ఎక్కువ మంది రైతులు ఉండటం, యూరియా తక్కువగా రావడంతో నిరాశతో వెనుదిరిగాడు. ప్రైవేట్‌గా 10 యూరియా బస్తాలు ఒకటి రూ.300 చొప్పున కొనుగోలు చేశానని వాపోయాడు.

యూరియా కోసం సొసైటీల వద్ద రైతుల పడిగాపులు

ఫ సోమవారం పీఏసీఎస్‌లకు భారీగా తరలివచ్చిన రైతులు

ఫ తెల్లవారుజాము నుంచే క్యూలైన్‌

ఫ గంటల తరబడి నిలబడితే ఎకరాకు ఒక్కటే బస్తా యూరియా

ఫ పోలీస్‌ పహారాలో పంపిణీ

ఫ ఇంకా 2వేల మెట్రిక్‌ టన్నులు వస్తేనే సమస్యకు పరిష్కారం

ఆత్మకూర్‌(ఎం) పీఏసీఎస్‌కు ఈనెల 29వ తేదీన 220 బస్తాల యూరియా వచ్చింది. పాస్‌ పుస్తకానికి రెండు బస్తాల చొప్పున పంపిణీ చేశారు. మొదట వచ్చిన రైతులకే యూరియా లభించింది. సుమారు 50 మంది రైతులకు అందకపోవడంతో నిరాశతో వెళ్లిపోయారు. పోలీసుల ఆధ్వర్యంలో యూరియా పంపిణీ చేశారు.

యూరియా వివరాలు (మెట్రిక్‌ టన్నుల్లో)

వచ్చిన మొత్తం 18,769

పంపిణీ 18,445

అందుబాటులో ఉన్నది 603

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement