
పాత పెన్షన్ విధానం అమలు చేయాలి
భువనగిరిటౌన్ : కంట్రిబ్యూటరీ పెన్షన్‌న్ స్కీం(సీపీఎస్) రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని విధానం అమలు చేయాలని జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి ధర్నా చౌక్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఉపేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వృద్ధాప్యంలో లక్షలాది ఉద్యోగుల భద్రత, కుటుంబాల సంక్షేమాన్ని బలి తీసుకున్న స్కీం సీపీఎస్ అని పేర్కొన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఆర్థిక, సామాజిక భద్రత కల్పించకుండా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు లాభం చేకూర్చే విధంగా ఉన్న సీపీఎస్ విధానం ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సీపీఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించే వరకు పోరాటం కొనసాగుతుందన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు, పెన్షనర్ల సంఘాలు, నాలుగో తరగతి ఉద్యోగ సంఘాల నేతలు మాట్లాడుతూ సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో భువనగిరి ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ జగన్‌మోహన్‌ప్రసాద్, నాయకులు ఖదీర్, భగత్, మధుసుధన్‌రెడ్డి, యాదయ్య, శ్రీనివాస్, లక్ష్మీనర్సిహారెడ్డి, కుమార్, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు.
ఫ జిల్లా ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్‌రెడ్డి