
కాళేశ్వరంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్
భువనగిరి : కాళేశ్వరం ప్రాజెక్టుపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను మంగళవారం బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్క్రీన్‌లో పార్టీ నేతలు వీక్షించారు. భువనగిరి, ఆలేరు నియోజకవర్గాలతో పాటు జిల్లాలోని ఇతర మండలాల నుంచి బీఆర్‌ఎస్ నాయకులు ప్రజెంటేషన్ విక్షించేందుకు తరలివచ్చారు. కార్యక్రమంలో భువనగిరి మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్‌రెడ్డి, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత, బూడిద భిక్షమయ్యగౌడ్, మాజీ జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మాజీ జిల్లా గ్రంథాయాల సంస్థ చైర్మన్ జడల అమరేందర్, మాజీ రైతు సమన్వయ సమితి కన్వీనర్ అమరేందర్ పాల్గొన్నారు.
ఫ వీక్షించిన మాజీ ఎమ్మెల్యేలు,
బీఆర్‌ఎస్ నాయకులు