
కొనసాగుతున్న ఆలయ భూముల సర్వే
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ భూములు, ఆస్తుల వివరాలను పటిష్టంగా ఉంచేందుకు చేపట్టిన డీజీపీఎస్ సర్వే కొనసాగుతోంది. మంగళవారం యాదగిరిగుట్ట పట్టణంలోని యోగానంద నిలయం, బస్టాండ్ ముందు గల దేవస్థానం స్థలంతో పాటు ఇతర భవనాలకు సంబంధించిన కొలతలు తీసుకుని సర్వే చేపట్టారు. ఈ సర్వేలో యాదగిరిగుట్ట టెంపుల్ డెవలప్‌మెంట్ అఽథారిటీ, దేవస్థానం భూముల పట్ల అవగాహన ఉండేందుకు ప్రస్తుతం జూనియర్ సిబ్బందితో ప్రత్యేక కమిటీ వేసి శిక్షణ ఇస్తున్నామని ఈఓ వెంకట్రావ్ వెల్లడించారు. సుమారు 15మంది దేవస్థానం క్లరికల్ సిబ్బంది ఈ సర్వేలో పాల్గొన్నారని తెలిపారు.