ధాన్యం దిగమింగారు! | - | Sakshi
Sakshi News home page

ధాన్యం దిగమింగారు!

Aug 6 2025 6:11 AM | Updated on Aug 6 2025 6:11 AM

ధాన్యం దిగమింగారు!

ధాన్యం దిగమింగారు!

సాక్షి, యాదాద్రి : ధాన్యం కొనుగోళ్లలో జరిగిన అక్రమాలపై సివిల్‌ సప్లయ్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు దృష్టి సారించారు. సీఎంఆర్‌ ఇవ్వాల్సిన పలువురు మిల్లర్లు చేతులెత్తేయడం, ఐకేపీ, పీఏసీఎస్‌ కేంద్రాల్లో చేపట్టిన ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు చోటుచేసుకోవడంతో ప్రభుత్వ ఆదాయానికి రూ.కోట్లలో గండి పడుతోంది. ఈనేపథ్యంలో సివిల్‌ సప్‌లై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు విచారణ చేస్తున్నారు.

ధాన్యం కొనుగోళ్లలో గోల్‌మాల్‌

వలిగొండ మండలం సంగెం పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రంలో బోగస్‌ రైతుల పేరుతో ట్రక్‌ షీట్‌తో ధాన్యం తూకం వేయకుండానే మిల్లుకు ఎగుమతి చేసినట్లు రికార్డు చూపించారు. అధికారుల విచారణలో రూ. 4.64 లక్షల దుర్వినియోగం బయటపడింది. ఇందులో 4.11 లక్షలు రికవరీ చేశారు. బాధ్యులపై క్రిమినల్‌ కేసులు నమోదు చేశారు. మరికొన్ని కొనుగోలు కేంద్రాలు రైతుల వద్ద రూ.1800 నుంచి రూ.2 వేల వరకు కొనుగోలు చేసి ప్రభుత్వ మద్దతు ధరకు కొనుగోలు కేంద్రాల్లో విక్రయించారు. ఇందులో మిలర్లు, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు పాత్ర ఉందన్నది బహిరంగ రహస్యం. అదేవిధంగా జిల్లాలోని పీఏసీఎస్‌ రుద్రవెళ్లి, చిన్నరావులపల్లి, ఆలేరు, గుండాల, మోటకొండూరు మండలాల్లో ప్రతియేటా ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయని స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.

సీఎంఆర్‌ టెండర్‌ ధాన్యం ఎగవేత

2022–23 యాసంగికి సంబంధించి 4,10,911 మెట్రిక్‌ టన్నులు ధాన్యం మిల్లులకు ఇచ్చారు. గత ప్రభుత్వంలో 1,86,180 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని వేలం వేసి మిల్లులకు అప్పగించింది. అయితే ఇందులో మిల్లులు ఆ ధాన్యాన్ని బహిరంగంగానే విక్రయించారు. దీంతో రెండేళ్లుగా రికవరీ చేయడానికి నానా తంటాలు పడుతోంది. ఆయా మిల్లులకు సీఎంఆర్‌ ఇవ్వమని ముందుగా ప్రకటించి ఆ తర్వాత యథావిధిగా ధాన్యం కేటాయించారు. టెండర్‌ ధాన్యం ఇంకా ప్రభుత్వానికి 32,314 వేల ఽమెట్రిక్‌ టన్నుల ధాన్యం ఎగుమతి చేయాల్సి ఉంది. కానీ మిల్లుల వద్ద ఇందుకు సంబంఽధించిన ధాన్యం లేదు. 2024–25 వానాకాలం సీజన్‌లో 2.22,444 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మిల్లులకు పంపిస్తే ఇందులో మిల్లర్ల నుంచి ఇప్పటివరకు 48.135 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ మాత్రమే వచ్చింది. ఇంకా 1.02, 458 మెట్రిక్‌ టన్నుల సీఎంఆర్‌ రావాల్సి ఉంది. 2024– 25 యాసంగి సీజన్‌లో 3,76,363 మెట్రిక్‌ టన్నుల ధాన్నాన్ని మిల్లులకు ఇచ్చారు. ఇందులోంచి 1.92, 611 మెట్రిక్‌ టన్నుల ధాన్యం సీఎంఆర్‌ రావాల్సి ఉంది. ధాన్యం దిగుమతి చేసుకున్న 25 మిల్లులు కిలో సీఎంఆర్‌ కూడా ఇవ్వని జాబితాలో ఉన్నాయి.

కొనుగోలు కేంద్రంలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరి అరెస్ట్‌

వలిగొండ : వలిగొండ మండలం సంగెంలోని వలిగొండ పీఏసీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రంలో అక్రమాలకు పాల్పడిన ఇద్దరిని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై యుగంధర్‌ మంగళవారం తెలిపారు. సివిల్‌ సప్లయ్‌ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేసి కొనుగోలు కేంద్రంలో ట్యాబ్‌ ఆపరేటర్‌గా పనిచేస్తున్న పబ్బతి శేఖర్‌, ట్యాబ్‌ ఆపరేటర్‌ అసిస్టెంట్‌ కాసుల బాలకిషన్‌ను అరెస్ట్‌ చేసి రామన్నపేట న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచినట్లు పేర్కొన్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు.

ఫ సీఎంఆర్‌ ఇవ్వడంలో చేతులెత్తేసిన పలువురు మిల్లర్లు

ఫ ధాన్యం కేంద్రాల్లో చేపట్టిన కొనుగోళ్లలో వెలుగుచూసిన అక్రమాలు

ఫ విచారణ చేస్తున్న సివిల్‌ సప్లయ్‌ విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు

ఫ వలిగొండ పీఏసీఎస్‌ కేంద్రంలో

ట్యాబ్‌ ఆపరేటర్‌తోపాటు,

ఆయన అసిస్టెంట్‌ అరెస్ట్‌

రెవెన్యూ రికవరీ యాక్టు నమోదు చేసినా..

2022–23వానాకాలంలో గుండాల మండలం అనంతారంలోని ఎల్‌ఎన్‌ రెడ్డి బిన్ని రైస్‌ మిల్లుకు కొనుగోలు కేంద్రాల నుంచి 1975 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని ఎగుమతి చేశారు. సీఎంఆర్‌ ఇవ్వకుండానే 1715 మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని మర ఆడించకుండానే మాయం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దాని విలువ రూ.4.18 కోట్లు. అధికారులు మిల్లు యజమానిపై రెవెన్యూ రికవరీ యాక్టు నమోదు చేశారే కాని ఒక్క రూపాయి కూడా రికవరీ చేయలేదు. పోచంపల్లి మండలంలోని ముక్తాపూర్‌లో ఎల్‌ఎన్‌ ఆగ్రో రైస్‌ మిల్లులో సుమారు రూ.10 కోట్లు విలువ చేసే వరి ధాన్యం మాయమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement