తుది దశకు తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

తుది దశకు తనిఖీలు

Aug 6 2025 6:11 AM | Updated on Aug 6 2025 6:11 AM

తుది దశకు తనిఖీలు

తుది దశకు తనిఖీలు

ఉన్నతాధికారుల ఆదేశాల

మేరకు చర్యలు

ప్రస్తుతం జిల్లాలో ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో తనిఖీలు జరుగుతున్నాయి. తనిఖీల ప్రక్రియ పూర్తి కాగానే పూర్తి వివరాలతో ఉన్నత అధికారులకు అందజేసి వారి ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటాం.

– డాక్టర్‌ మనోహర్‌,

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి

భువనగిరి: జిల్లాలోని ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చేపట్టిన తనిఖీలు తుది దశకు చేరుకున్నాయి. గత నెలలో నిబంధనలకు విరుద్ధంగా మూడు అబార్షన్లు, ఒక చోట తల్లి, మరొక చోట శిశువు మృతి చెందడంతో అధికారులు దృష్టి సారించారు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లను తనిఖీ చేసేందుకు ప్రోగ్రాం ఆఫీసర్లతో ఆరు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. గత నెల 20వ తేదీ నుంచి తనిఖీలు చేయడం ప్రారంభించారు. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది.

ఈ అంశాలపై తనిఖీ

జిల్లాలో ప్రస్తుతం 171 ప్రైవేట్‌ ఆస్పత్రులు, 80 డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ఉన్నాయి. ఆస్పత్రుల్లో ఇప్పటి వరకు 70 శాతం వరకు పూర్తి కాగా డయాగ్నస్టిక్‌ సెంటర్లు ఇప్పటికే పూర్తి చేశారు. మిగిలిన 30 శాతానికి సంబంధించి రెండు, మూడు రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉంది. తనిఖీల్లో గుర్తించిన అంశాలకు సంబంధించి నివేదికను జిల్లా వైద్యాధికారికి అందజేశారు. నివేదికలో చాలా వరకు ఆస్పత్రులు నిబంధనలకు విరుద్ధంగానే నిర్వహిస్తున్నారని గుర్తించినట్లు సమాచారం. రిజిస్ట్రర్‌ సమయంలో పేర్లు ఉన్న వారుకాకుండా మరొకరు వైద్య సేవలందించడం, బయోమెడికల్‌ వేస్ట్‌ మెనేజ్‌మెంట్‌ నిర్వహణ లేకపోవడం, ఆర్‌ఎంపీలు లేదా ఆయూష్‌ వైద్యుల ద్వారా వైద్య సేవలందించడం, శిక్షణ లేని పారామెడికల్‌ సిబ్బంది ఉండటం, వెలుతురు, గాలి, నీటి సౌకర్యం లేకుండా ఆస్పత్రుల నిర్వహణ, ఫైర్‌ సిస్టం లేకపోవడం వంటి వాటిని గుర్తించినట్లు తెలుస్తోంది.

ఒక వైపు తనిఖీలు.. మరో వైపు పైరవీలు

ప్రత్యేక బృందాలు ఒక వైపు తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆస్పత్రుల వివరాలు, డయాగ్నోస్టిక్‌ సెంటర్ల వివరాలు నమోదు చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తమపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు వీటి నిర్వాహకులు రాజకీయనాయకులు, ప్రజాప్రతినిధుల ద్వారా పైరవీలు చేయడం ప్రారంభించారు. ఫోన్‌ చేసి అధికారులపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు తెలుస్తోంది.

గతంలో మాదిరిగానే వదిలేస్తారా..

సాధారణంగా జిల్లాలో వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రతి ఆరు నెలలకొకసారి ప్రత్యేక అధికారులు బృందం ప్రైవేట్‌ ఆస్పత్రులు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లను తనిఖీ చేస్తుంటారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న ఆస్పత్రులకు, డయాగ్నోస్టిక్‌ సెంటర్లకు షోకాజ్‌ నోటీసులు జారీ చేస్తారు. అవసరమైతే సీజ్‌ చేస్తారు. అయితే వివిధ ప్రయత్నాలు చేసి ఆస్పత్రుల నిర్వాహకులు తిరిగి యథావిధిగా నిర్వహిస్తున్నారు. జిల్లాలో గత నెలలో జరిగిన సంఘటనలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక బృందాలు గుర్తించిన అంశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటారా లేదా గతంలో మాదిరిగానే వదిలేస్తారా అని పట్టణ వాసులు సందేహం వ్యక్తం చేస్తున్నారు.

ఫ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్‌

ఆస్పత్రులు నిర్వహిస్తున్నట్లు గుర్తించిన అధికారులు

ఫ ఇప్పటివరకు 70శాతం

ఆస్పత్రుల్లో తనిఖీలు పూర్తి

ఫ ఉన్నతాధికారులకు నివేదిక అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement