
మునుగోడు అభివృద్ధి నా బాధ్యత
సంస్థాన్ నారాయణపురం: మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి బాధ్యత తనదని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. సంస్థాన్‌నారాయణపురం మండలంలోని లచ్చమ్మగూడెం, చిమిర్యాల గ్రామాల్లో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి మంగళవారం 33/11 విద్యుత్ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా ఐదు సబ్‌స్టేషన్లు ప్రారంభించుకోవడం చాలా సంతోషకరమన్నారు. లోఓల్టేజీ సమస్య లేకుండా నియోజకవర్గవ్యాప్తంగా మరో 10 సబ్‌స్టేషన్లు తీసుకురావడానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు.అభివృద్ధిపై అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కుంభం శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, తహసీల్దార్ శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీఓ ప్రమోద్‌కుమార్, ఏడీ పద్మ, ఏఈ దివ్య, కరంటోత్ శ్రీనివాస్, గుత్త ఉమాదేవి, దోనూరి జైపాల్‌రెడ్డి, గుత్త ప్రేమ్‌చందర్‌రెడ్డి, జక్కలి ఐలయ్య, భిక్షపతి, భానుమతి, బుజ్జి, ఉప్పల లింగస్వామి పాల్గొన్నారు.
గ్రామాల్లో లోవోల్టేజీ సమస్య లేకుండా చేస్తా
చౌటుప్పల్ రూరల్: గ్రామాల్లో లోవోల్టేజీ సమస్య లేకుండా చేస్తానని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. చౌటుప్పల్ మండలంలోని ఎనగంటితండాలో నూతనంగా నిర్మించనున్న 11కేవీ సబ్‌స్టేషన్ నిర్మాణ పనులకు ఎమ్మెల్సీ నెలికంటి సత్యంతో కలిసి మంగళవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గ్రామాల్లో కరెంట్ సమస్యలు లేకుండా ఉండేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో చౌటుప్పల్ ఆర్డీఓ శేఖర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్ ఉబ్బు వెంకటయ్య, వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపీపీ తాడూరి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, మున్సిపల్ అధ్యక్షుడు సుర్వి నర్సింహ, నాయకులు వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్ కొలను శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

మునుగోడు అభివృద్ధి నా బాధ్యత