
మొన్న సన్న బియ్యం.. నేడు రేషన్ కార్డులు
సోమవారం శ్రీ 14 శ్రీ జూలై శ్రీ 2025
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ప్రజా సంక్షేమంలో కీలకమైన పథకాల అమలులో ఉమ్మడి నల్లగొండ జిల్లా వేదికగా నిలుస్తోంది. ఇప్పటికే సూర్యాపేట జిల్లా హు జూర్‌నగర్‌లో సన్నబియ్యం పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్‌రెడ్డి.. సోమవారం సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో రేషన్‌కార్డుల పంపిణీకి కూడా ఆయనే శ్రీకారం చుట్టనున్నారు. నిరుపేద కుటుంబాలకు ఆహారభద్రత కల్పించే ముఖ్యమైన రెండు పథకాల అమలుకు ఉమ్మడి నల్లగొండనే కేంద్ర బిందువు కావడం విశేషం.
నెరవేరబోతున్న పేదల కల
అసెంబ్లీ ఎన్నికల సమయంలో అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అందులో భాగంగా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో, ప్రజాపాలన సభల్లో దరఖాస్తులు స్వీకరించింది. వాటిని పరిశీలించి అర్హులైన వారికి రేషన్‌కార్డులు ఇచ్చేందుకు సిద్ధమైంది. దీంతో రేషన్‌కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నపేదల కల నెరవేరబోతోంది. గతంలో అనేకసార్లు దరఖాస్తు చేసుకున్నా కార్డు రాకపోవడంతో రేషన్ బియ్యం అందక ఇబ్బందులు పడ్డారు. అలాంటి వారందరికీ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అన్ని జిల్లాల్లో అర్హుల జాబితాలను సిద్ధం చేశారు. సోమవారం సీఎం రేవంత్‌రెడ్డి రేషన్ కార్డుల పంపిణీని ప్రారంభించిన తరువాత జిల్లాల్లో పజాప్రతినిధులు లబ్ధిదారులకు కార్డులు పంపిణీ చేస్తారు.
మంత్రి ఉత్తమ్ ప్రత్యేక చొరవ
పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రి అయినందున తిరుమలగిరిలో కార్యక్రమం ప్రారంభించేలా సీఎంను ఒప్పించారు. గతంలో సన్నబియ్యం పంపిణీ పథకాన్ని కూడా తన సొంత నియోజకవర్గమైన హుజూర్‌నగర్‌నుంచే ప్రారంభింపజేశారు. తాజాగా సూర్యాపేట జిల్లాలోని తుంగతుర్తి నియోజకవర్గం తిరుమలగిరి నుంచి రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించేలా చర్యలు చేపట్టారు. పేదలకు ఎంతో ఉపయోగపడే రెండు కీలకమైన పథకాలు మన జిల్లా నుంచే ప్రారంభం కావడం జిల్లాకు దక్కిన గౌరవంగా చెప్పుకోవచ్చు.
నల్లగొండ జిల్లాకు 50,102 కొత్త రేషన్ కార్డులు
కొత్త రేషన్ కార్డులు అత్యధికంగా లభించబోతున్న జిల్లా నల్లగొండ కావడం విశేషం. కార్డులు మంజూరైన పది జిల్లాల్లో నల్లగొండ జిల్లా అగ్రస్థానంలో ఉంది. నల్లగొండ జిల్లాలో 50,102 కొత్త రేషన్ కార్డులు రాబోతున్నాయి. నల్లగొండ జిల్లాలో ప్రస్తుతం 4,65,998 రేషన్ కార్డులు ఉండగా, ఇప్పుడు మరో 50,102 కొత్త రేషన్ కార్డులు వస్తాయి. జిల్లాలో మొత్తంగా 5,16,100 రేషన్ కార్డుల ద్వారా 16,80,916 మందికి లబ్ధి చేకూరనుండగా, కార్డుల్లో అదనపు పేర్లు చేర్పుల ద్వారా మరో 1,06,559 మందికి లబ్ధి చేకూరనుంది. సూర్యాపేట జిల్లాలో 3,26,057 పాత కార్డులు ఉండగా, ఇప్పుడు 23,870 కొత్త కార్డులు రాబోతున్నాయి. జిల్లాలో మొత్తంగా 3,49,927 కార్డుల ద్వారా 10,57,863 మందికి లబ్ధి చేకూరనుంది. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఇప్పటివరకు 2,16,831 రేషన్ కార్డులు ఉండగా, ఇప్పుడు 15,077 కొత్త రేషన్ కార్డులు మంజూరయ్యాయి. ఇలా మొత్తంగా 2,31,908 రేషన్ కార్డుల ద్వారా 7,29,746 మందికి లబ్ధి చేకూరనుంది.
న్యూస్‌రీల్
సంక్షేమంలో రెండు కీలక పథకాల అమలు మన దగ్గరి నుంచే..
ఫ ఉమ్మడి జిల్లాకు దక్కిన ప్రాధాన్యం
ఫ నేడు తిరుమలగిరి సభలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా నూతన రేషన్ కార్డుల పంపిణీ
ఫ రాష్ట్రంలో అత్యధికంగా నల్లగొండకే..
50వేల మంది జనసమీకరణ
ఫ 35 ఎకరాల్లో సభా ప్రాంగణం
ఫ 11 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్
తిరుమలగిరి (తుంగతుర్తి) : తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలో సోమవారం చేపట్టనున్న నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి 50 వేల మంది జనసమీకరణకు ఏర్పాట్లు చేశారు. నూతన రేషన్ కార్డుల లబ్ధిదారులు, సమ భావన సంఘాల సభ్యులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వస్తారని అంచనా వేశారు. జన సమీకరణకు 300 ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రాక సందర్భంగా తహసీల్దార్ కార్యాలయం వెనక ఉన్న 35 ఎకరాల్లో సభా స్థలి ఏర్పాటు చేశారు. రెండు హెలిపాడ్లు, 11 ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్‌కు ఏర్పాటు చేశారు. సభా ప్రాంగణంలోని పరిసరాల్లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్ కటౌట్‌లతో నింపారు.

మొన్న సన్న బియ్యం.. నేడు రేషన్ కార్డులు

మొన్న సన్న బియ్యం.. నేడు రేషన్ కార్డులు

మొన్న సన్న బియ్యం.. నేడు రేషన్ కార్డులు