
రేషన్‌కార్డుల పంపిణీకి భారీగా తరలిరావాలి
తిరుమలగిరి (తుంగతుర్తి): తిరుమలగిరిలో సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా చేపడుతున్న నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి భారీగా తరలిరావాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ కోరారు. ఆదివారం తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన సభా స్థలిని పరిశీలించారు. వారి వెంట ఎమ్మెల్సీ శంకర్ నాయక్, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్, ప్రమోద్‌కుమార్, పార్టీ మండల అధ్యక్షుడు నరేష్, వీరేష్, లక్ష్మయ్య, జమ్మిలాల్ పాల్గొన్నారు.