
1200 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు
తిరుమలగిరి (తుంగతుర్తి): సీఎం రేవంత్‌రెడ్డి తిరుమలగిరిలో సోమవారం పర్యటించనున్న నేపథ్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ నర్సింహ తెలిపారు. ఆదివారం తిరుమలగిరిలో పోలీస్ సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. సీఎం బహిరంగ సభకు 1200 మంది సిబ్బందితో బందోబస్తు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సభకు వచ్చే ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ పునరుద్ధరించాలని ఆదేశించారు. నలుగురు ఏఎస్పీలు, ఆరుగురు డీఎస్పీలు, 33 మంది ఇన్‌స్పెక్టర్లు, 110 మంది ఎస్‌ఐలు, 185 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 650మంది కానిస్టేబుళ్లు, హోంగార్డులు విధులు నిర్వహిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీలు రవీందర్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి, డీఎస్పీలు ప్రసన్నకుమార్, శ్రీధర్, శ్రీనివాసరావు, సురేష్‌కుమార్, మొగులయ్య, రవి, వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పార్కింగ్ ప్రదేశాల కేటాయింపు
ఫ సూర్యాపేట, తొర్రూరు, జనగామ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులు, పెద్ద వాహనాలు అగ్రికల్చర్ మార్కెట్ యార్డు, సంత నందు ఏర్పాటు చేసి పి6, పి7 ప్రదేశాల్లో నిలుపుకోవాలి.
ఫ సూర్యాపేట, తొర్రూరు, జనగామ నుంచి వచ్చే ట్రాక్టర్లు, డీసీఎంలు తిరుమలగిరి క్రాస్ రోడ్డు నుంచి జనగామ వెళ్లే రోడ్డు మార్గంలో ఎడమ వైపున సంత వెనకాల స్థలంలో ఏర్పాటు చేసిన పీ4 పార్కింగ్ స్థలంలో నిలపాలి.
ఫ జనగామ, తొర్రూరు, సూర్యాపేట వైపు వచ్చే కార్లు, ఆటోలు, మినీ వ్యాన్లు వలిగొండ రోడ్డులో వచ్చి చెరువుకట్ట మార్గంలో ఉన్న పీ2, పీ11, పీ5 పార్కింగ్ ప్రదేశాల్లో నిలుపుకోవాలి.
ఫ తొర్రూరు, సూర్యాపేట, జనగామ వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు వలిగొండ మార్గంలో చెరువు కట్ట రోడ్డులో ఏర్పాటు చేసిన పీ3 స్థలంలో నిలుపుకోవాలి.
ఫ వలిగొండ మార్గంలో వచ్చే ఆర్టీసీ బస్సులు, పెద్ద వాహనాలు, అదే మార్గంలో ఉన్న ఐకేపీ సెంటర్‌లో ఏర్పాటు చేసిన పీ10 పార్కింగ్ ప్రదేశంలో, వెంచర్‌లో ఏర్పాటు చేసిన పీ8 స్థలంలో వాహనాలు నిలుపుకోవాలి.
ఫ వలిగొండ వైపు నుంచి వచ్చే కార్లు, ఆటోలు, మినీ వ్యాన్‌లు వెంచర్‌లో ఏర్పాటు చేసిన పీ9 పార్కింగ్ ప్రదేశంలో నిలపాలి.
ఫ సూర్యాపేట ఎస్పీ నర్సింహ

1200 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు