
సీఎం సభకు పకడ్బందీ ఏర్పాట్లు
ఫ సూర్యాపేట కలెక్టర్ తేజస్ నంద్‌లాల్
తిరుమలగిరి (తుంగతుర్తి) : నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వస్తున్న సందర్భంగా పకడ్బందీ ఏర్పాట్లు చేశామని కలెక్టర్ తేజస్ నంద్‌లాల్ పవార్ అన్నారు. ఆదివారం తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని సభాస్థలిలో ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో రివ్యూ సమావేశం నిర్వహించారు. ప్రొటోకాల్ ప్రకారం ఏర్పాట్లు చేయాలన్నారు. విద్యుత్ సరఫరా నిరంతరం ఉండాలన్నారు. కలెక్టర్ వెంట ఎస్పీ నర్సింహ, అదనపు కలెక్టర్ రాంబాబు, జెడ్పీసీఈఓ అప్పారావు, డీఎఫ్‌ఓ సతీష్‌కుమార్ ఉన్నారు.