
డెబిట్ కార్డు లేదా.. డోంట్ వర్రీ!
భువనగిరిటౌన్ : డెబిట్ కార్డు ఇంట్లో మరిచిపోయారా? డోంట్ వర్రీ! కార్డు లేకపోయినా చాలా సులువుగా ఏటీఎం నుంచి డబ్బులు తీసుకోవచ్చు. చేతిలో ఉన్న ఫోన్‌లోని ఫీచర్స్‌ను వాడుకొని క్యాష్ విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈ తరహా ఏటీఎంను భువనగిరి పట్టణంలో తొలిసారిగా ఏర్పాటు చేశారు. హితాచీ మనీస్పాట్ ఏటీఎం పేరుతో జగదేవ్‌పూర్ రోడ్డులో ఆవిష్కరించారు. క్రమంగా వీటిని రద్దీ ఏరియాలు, దర్శనీయ ప్రాంతాలకు విస్తరించనున్నట్లు కంపెనీ నిర్వాహకులు తెలిపారు.
క్యాష్ డ్రా చేసే విధానం ఇలా..
ఏటీఎం నుంచి క్యాష్ విత్‌డ్రా చేసేందుకు యూపీఐ ఫీచర్‌ను కూడా మనం వాడుకోవచ్చు. ఇందుకోసం మన స్మార్ట్‌ఫోన్‌లోని యూపీఐ యాప్‌ను వాడాలి. తొలుత ఏటీఎం స్క్రీన్‌పై యూపీఐ కార్డ్‌లెస్ క్యాష్ ఆప్షన్‌న్‌పై క్లిక్ చేసి విత్‌డ్రా చేయాలనుకుంటున్న నగదు మొత్తాన్ని ఎంపిక చేసుకోవాలి. తరువాత స్క్రీన్ పైన క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. ఫోన్‌లోని బ్యాంకు యూపీఐ ఆధారిత యాప్‌తో దాన్ని స్కాన్‌న్ చేయాలి. యూపీఐ పిన్‌ను తప్పకుండా యాప్‌లో ఎంటర్ చేయాలి. ఆతరువాత ఏటీఎం నుంచి డబ్బులు బయటకు వస్తాయి. నగడు విత్‌డ్రా అయినట్లు సెల్‌ఫోన్‌కు మెసేజ్ కూడా వస్తుంది. డెబిట్ కార్డు అవసరం లేకుండానే దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సైతం నగదును పొందేలా నూతన విధానం తీసుకువచ్చినట్లు కంపెనీ ప్రతినిధులు తెలిపారు.
యూపీఐ ఫీచర్ ద్వారా క్యాష్ విత్ డ్రాకు అవకాశం
ఫ భువనగిరిలో తొలిసారిగా కార్డ్‌లెస్ ఏటీఎం ఏర్పాటు
ఫ త్వరలో మిగతా ప్రాంతాలకు..