
నాడు సాగు భూమి.. నేడు ఆధ్యాత్మిక వాడ
యాదగిరిగుట్ట: ఒకప్పుడు పచ్చని పంటలతో కనిపించే ప్రాంతమంతా నేడు ఆధ్యాత్మిక వాడగా రూపుదిద్దుకుంది. యాదగిరి కొండకు దిగువన 2016కంటే ముందు పంట పొలాలతో ఉండేది. ఇప్పుడు యాదగిరి క్షేత్ర అభివృద్ధిలో భాగంగా భక్తుల కోసం ఆధ్యాత్మిక భవనాలు నిర్మించారు. ప్రస్తుతం కొండకు దిగువన ఉత్తర దిశలో శ్రీసత్యనారాయణస్వామి వ్రత మండపం, లక్ష్మీ పుష్కరిణి, దీక్షా పరుల మండపం, కల్యాణ కట్ట, ఆర్టీసీ బస్టాండ్, సెంట్రల్ పార్కింగ్, ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణాలు చేశారు. చెట్లను, గుట్టలను, పొలాలను తొలగించి పెద్ద రోడ్లు వేసి ఆకుపచ్చని అందం సంతరించుకునేలా మొక్కలు నాటారు. ఒకప్పుడు పచ్చని పొలాలు, చెట్లతో ఉన్న ఆ ప్రాంతమంతా ఇప్పుడు ఆధ్యాత్మిక వాడగా రూపుదిద్దుకుంది.