
గ్రూప్–2 ఉద్యోగానికి మల్లాపురం వాసి ఎంపిక
పెద్దఅడిశర్లపల్లి : పెద్దఅడిశర్లపల్లి మండలం మల్లాపురం గ్రామానికి చెందిన నారాయణదాసు హరిబాబు గ్రూప్– 2 ఉద్యోగానికి ఎంపికయ్యాడు. ఉస్మానియా క్యాంపస్‌లో ఎల్‌ఎల్‌బీ ఫైనల్ ఇయర్ చదువుతున్న ఈయన గ్రూప్ – 2 పరీక్ష రాసి 606 ర్యాంక్ సాధించాడు. దీంతో మండలవాసులు హరిబాబుకు అభినందనలు తెలిపారు.
ద్విచక్ర వాహనాలు ఢీకొని ఇద్దరికి గాయాలు
గుండాల : ఎదురుదురుగా ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు గాయాలపాలైన సంఘటన గుండాల మండలంలోని సుద్దాల గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుండాల గ్రామానికి చెందిన అల్తాఫ్ సుద్దాల గ్రామం వైపు బైక్‌పై వెళ్తుండగా.. సుద్దాల గ్రామానికి చెందిన గూడ వెంకటేష్ వ్యవసాయ బావి నుంచి వస్తూ సబ్ స్టేషన్ ఆవరణలో ఎదురెదురుగా ఢీకొన్నారు. ఇద్దరిని 108 వాహనంలో జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ సైదులు తెలిపారు.
ఎడ్లబండిని ఢీకొని
యువకుడు మృతి
మునుగోడు: ఎద్దులబండిని ఢీకొని యువకుడు మృతిచెందిన సంఘటన శుక్రవారం మునుగోడులో చోటుచేసుకుంది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మునుగోడు పట్టణానికి చెందిన పందుల నర్సింహ(26) ఇళ్లకు పెయిటింగ్ వేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం చీకటిమామిడి గ్రామానికి తన బైక్‌పై వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యంలో ఎంపీడీఓ కార్యాలయ సమీపంలో ఎడ్ల బండిని బలంగా ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. అతడిని నల్లగొండలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడే చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున మృతి చెందాడు. మృతుడి తల్లి ధనమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ రవి తెలిపారు.

గ్రూప్–2 ఉద్యోగానికి మల్లాపురం వాసి ఎంపిక