
ప్రేమించిన యువతి వివాహమైందని..
భువనగిరి: ప్రేమించిన యువతి వివాహమైందని మనస్తాపానికి గురైన యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన భువనగిరి మండలంలోని తుక్కాపురం గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన రాసాల అయిలయ్య, భాగ్యమ్మ కుమారుడు మధు(23) రోజుమాదిరిగా ఈ నెల 22న రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి నిద్రించాడు. తల్లి భాగ్యమ్మ ఉదయం లేచి ఇంట్లో గదులను శుభ్రం చేసేందుకు వెళ్లింది. ఈ క్రమంలో మధు నిద్రించే గది తలుపు తెరిచింది. కుమారుడు ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని కనిపించాడు. స్థానికులు సమాచారం అందించడంతో అక్కడికి చేరుకున్న పోలీసులకు మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ప్రేమించిన యువతి వివాహం కావడంతోపాటు, అప్పులు ఎక్కవ అయ్యాయనే బాధతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి రూరల్ సీఐ చంద్రబాబు తెలిపారు.
ఫ మనస్తాపంతో ఉరేసుకున్న యువకుడు