
ధాన్యం ఎగుమతిలో జాప్యం చేయొద్దు
ఆలేరు: కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన ధాన్యాన్ని జాప్యం చేయకుండా ఎప్పటికప్పుడు మిల్లులకు ఎగుమతి చేయాలని అదనపు కలెక్టర్ వీరారెడ్డి(రెవెన్యూ) కేంద్రాల నిర్వాహకులను ఆదేశించారు. సోమవారం తహసీల్దార్ అంజిరెడ్డితో కలిసి ఆలేరు, కొల్లూరులో కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. కొనుగోళ్లు వేగవంతం చేయాలని, తేమ శాతం వచ్చిన ధాన్యాన్ని తూకం వేసిన తరువాత కేంద్రాల వద్ద నిల్వ ఉంచకుండా వెంటనే మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు. రైతుల నుంచి సేకరించిన ధాన్యం వివరాలను ఏరోజుకారోజు ట్యాబ్ ఎంట్రీ చేయాలన్నారు. ఆలేరు మండలంలో ఇప్పటి వరకు 84,248 బస్తాల ధాన్యం కొనుగోలు చేసినట్టు ఆయన తెలిపారు.
శివుడికి విశేష పూజలు
యాదగిరిగుట్ట: యాదగిరి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి అనుబంధంగా కొండపై ఉన్న శ్రీపర్వత వర్థిని సమేత రామలింగేశ్వరస్వామి క్షేత్రంలో సంప్రదాయ పూజలు విశేషంగా చేపట్టారు. సోమవారం స్వామివారికి ఇష్టమైన రోజు కావడంతో రుద్రాభిషేకం, బిల్వార్చన, ఆలయ ముఖమండపంలోని స్పటికలింగానికి ప్రత్యేక పూజలు చేశారు. ఆయా పూజల్లో భక్తులు పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఇక ప్రధానాలయంలో సంప్రదాయ పూజలు కొనసాగాయి. వేకువజామున సుప్రభాత సేవత, గర్భాలయంలోని స్వయంభూలు, ప్రతిష్ఠా అలకారంమూర్తులకు నిజాభిషేకం, సహస్రనామార్చన తదితర పూజలు నిర్వహించారు.
మహిళా సదస్సును జయప్రదం చేయాలి
భువనగిరి : కేరళలో ఈ నెల 9,10 తేదీల్లో జరగనున్న మహిళా కూలీల జాతీయ సదస్సును జయప్రదం చేయాలని మహిళా కూలీల రాష్ట్ర కన్వీనర్ బొప్పని పద్మ పేర్కొన్నారు. సోమవారం భువనగిరి మండలం ముత్తిరెడ్డిగూడెంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మహిళా కూలీల సమస్యలపై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో మహిళలపై వివక్ష కొనసాగుతుందన్నారు. మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయే తప్ప.. తగడ్డం లేదన్నారు. చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన బాధ్యత పాలకులపై ఉందన్నారు. సదస్సుకు మహిళలు అధిక సంఖ్యలో హాజరుకావాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా సహాయ కార్యదర్శి కుమారి, జిల్లా ఉపాధ్యక్షులు పల్లెర్ల అంజయ్య, కూలీలు సత్తమ్మ, మాధవి, సువర్ణ, స్వాతి, కవిత, బాలమణి,పోచమ్మ,అఖిల తదితరులు ఉన్నారు.
కానిస్టేబుల్‌కు అవార్డు
ఆత్మకూరు(ఎం): విఽధి నిర్వహణలో ధైర్య సా హసాలు ప్రదర్శించినందుకు గాను ఆత్మకూర్ (ఎం) మండలం రహీంఖాన్‌పేటకు చెందిన తాళ్లపెల్లి మహేందర్‌గౌడ్ తెలంగాణ పోలీస్ రియల్ హీరోస్ అవార్డుకు ఎంపికయ్యాడు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా అవార్డు, ప్రశంసాపత్రం అందుకున్నారు. అదే విధంగా డీజీపీ చేతుల మీదుగా రూ.50వేల నగదు రివార్డుతో పాటు ప్రశంసా పత్రం తీసుకున్నారు.

ధాన్యం ఎగుమతిలో జాప్యం చేయొద్దు

ధాన్యం ఎగుమతిలో జాప్యం చేయొద్దు

ధాన్యం ఎగుమతిలో జాప్యం చేయొద్దు