
సమ్మర్ క్యాంపుతో వినోదం, విజ్ఞానం
భూదాన్‌పోచంపల్లి : వినోదంతో పాటు విజ్ఞానం పంచేందుకు సమ్మర్ క్యాంపు దోహదపడుతుందని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని డీఈఓ సత్యనారాయణ సూచించారు. సోమవారం భూదాన్‌పోచంపల్లి మండలం జలాల్‌పురంలోని కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయంలో సమ్మర్ క్యాంపును ప్రారంభించి మాట్లాడారు. లలితకళలు, సంగీతం, డ్యాన్స్, డ్రాయింగ్, కంప్యూటర్ నైపుణ్యాలు, స్పోకెన్ ఇంగ్లిష్, గణితంలో మెళకువలు, యోగా, క్రీడల్లో ఈనెల 20వరకు శిక్షణ ఉంటుందన్నారు. జిల్లాలోని అన్ని కేజీబీవీల నుంచి 100 మంది విద్యార్థులు క్యాంపులో పాల్గొంటున్నార, వీరికి ఉచిత శిక్షణతో పాటు భోజన వసతి కూడా కల్పిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా జనరల్ ఈక్విటీ కోఆర్డినేటర్ సీహెచ్ రాధ, క్యాంప్ కోఆర్డినేటర్ ఇందిర, అసిస్టెంట్ కోఆర్డినేటర్ భవానీ, రిసోర్స్ పర్సన్లు, వ్యాయామ ఉపాధ్యాయులు, ఏఎన్‌ఎంలు, సిబ్బంది పాల్గొన్నారు.
ఫ డీఈఓ సత్యనారాయణ