
తాటిపాములను ఆదర్శంగా తీర్చిదిద్దుతా : మంత్రి ఉత్తమ్
తిరుమలగిరి (తుంగతుర్తి): తన స్వగ్రామం తాటిపాములను ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాముల గ్రామంలో రూ.16 కోట్లతో బ్రిడ్జి, రూ.7.14 కోట్లతో చెక్ డ్యామ్, రూ.25 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. రూ.60 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. 600 మంది మహిళలకు ఉచితంగా కుట్టుమిషన్లు అందజేశారు. ఈ సందర్భంగాఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. దేవాదుల ప్రాజెక్టులో భాగంగా చెన్నూరు రిజర్వాయర్ నుంచి నీరందిస్తామని పేర్కొన్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందన్నారు. ధాన్యం ఉత్పత్తిలో దేశంలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలవగా.. రాష్ట్రంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉందన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని ఎమ్మెల్యే మందుల సామేల్ మంత్రిని కోరారు. సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎంపీ కిరణ్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాజగో పాల్‌రెడ్డి, అనిల్‌కుమార్‌రెడ్డి, ఆర్థిక సంఘం సభ్యుడు సంకెపల్లి సుధీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.