
పూర్వ విద్యార్థుల సమ్మేళనం
గచ్చిబౌలి: ప్రభుత్వ పాఠశాలలో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించిన వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని నూతన్‌కల్ జడ్పీహెచ్‌ఎస్ పూర్వ విద్యార్థి డాక్టర్ మర్రి సత్యనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కొండాపూర్‌లోని తెలంగాణ కాంట్రాక్టర్స్ క్లబ్‌లో సూర్యాపేట జిల్లా నూతనకల్ జడ్‌పీహెచ్‌ఎస్ స్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు. పూర్వ విద్యార్థులైన చురుకంటి పవన్‌రెడ్డి, చురుకంటి అశోక్‌రెడ్డి, చురుకంటి శ్యామ్‌సుందర్‌రెడ్డిలు టీజీ పోలీస్ కంప్‌లైంట్స్ అథారిటీ మెంబర్ ఆర్.రామ్మోహన్, ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజమల్లును సన్మానించారు.