పల్లెటూరి పిల్లగాడు.. పాటల్లో మొనగాడు | - | Sakshi
Sakshi News home page

పల్లెటూరి పిల్లగాడు.. పాటల్లో మొనగాడు

May 5 2025 8:54 AM | Updated on May 5 2025 8:56 AM

ప్రశంసలు అందుకున్న ప్రశాంత్‌..

తెలంగాణ ఉద్యమంలో ‘అమ్మ తెలంగాణ.. మరో తెలంగాణ.. అమరవీరులే... అంటూ పాట రాసి స్వయంగా పాడాడు. కరోనా సమయంలో మంత్రి సీతక్క చేపట్టిన సేవలపై శ్రీమలినం లేని మట్టిమనిషి’ అంటూ వీడియో చేసి మంత్రి సీతక్క చేతుల మీదుగా అవిష్కరింపజేశాడు. ఇటీవల కశ్మీర్‌ పహల్గాం వద్ద ఉగ్రదాడిని నిరసిస్తూ ‘భరతమాత శిరస్సుపై సరిహద్దు కంచె తెంపి దూసుకొచ్చె సంగ్రామం’ అంటూ ఇటీవల దేశభక్తి వీడియో రూపొందించి ప్రముఖ కవి డి. అరవిందరాయుడు చేతుల మీదుగా విడుదల చేశాడు. గ్రామ పంచాయతీ కార్మికులపై కూడా వీడియోలు రూపొందిచాడు. సమాజాన్ని మేల్కొలిపే విధంగా పాటల రచన చేస్తున్న ప్రశాంత్‌ ఇటీవల హైకోర్డు జడ్జి చంద్రశేఖర్‌ చేతుల మీదుగా బెస్ట్‌ లిరిసిస్ట్‌ అవార్డు సైతం అందుకున్నాడు. ప్రశాంత్‌ కృషిని మంత్రి సీతక్క, జాతీయ అవార్డు గ్రహీత సుద్దాల అశోక్‌తేజ సైతం అభినందించారు. తనకు అవకాశం కల్పిస్తే సినిమా రంగంలో పాటలు రచన చేసి పాడగలని, అవకాశం కోసం ఎదురుచూస్తున్నానని ప్రశాంత్‌ అంటున్నాడు.

ఆత్మకూరు(ఎం): మారుమూల పల్లెటూరిలో పుట్టి పాటలపై తనకున్న ఆసక్తితో సమాజాన్ని మేల్కొలిపేలా పాటలు రూపొందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నాడు ఆత్మకూరు(ఎం) మండలం మోదుబావిగూడేనికి చెందిన చంద్రగిరి ప్రశాంత్‌. ప్రశాంత్‌ స్వయంగా పాటలు రాసి వాటిని పాడుతూ చేస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూ పలువురిని ఆకట్టుకుంటున్నాయి. మోదుబావిగూడేనికి చెందిన వసంత, రాజారామ్‌ దంపతుల కుమారుడు ప్రశాంత్‌ డిగ్రీ వరకు చదువుకున్నాడు. ప్రస్తుతం ప్రశాంత్‌ కప్రాయపల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఎలక్ట్రీ షియన్‌గా పనిచేస్తున్నాడు. పదో తరగతి చదువుతున్న రోజుల్లో స్కూల్‌లో పాటల పోటీలు నిర్వహించగా.. తన తల్లి వసంత తోటి కూలీలతో కలిసి పొలంలో పాడిన పాట గుర్తొచ్చి దానిని ప్రశాంత్‌ పాడి వినిపించాడు. గొంతు చాలా చక్కగా ఉండటంతో ఉపాధ్యాయులు ప్రశాంత్‌ను అభినందించారు. అప్పటి నుంచి తానే స్వయంగా పాటలు రాసి, సీడీలు చేయాలని ప్రశాంత్‌ లక్ష్యంగా పెట్టుకున్నాడు. ప్రతి పాట సీడీ చేయాలంటే సుమారు రూ.20వేల వరకు ఖర్చయ్యేదని, తన జీతంతో పాటు తల్లిదండ్రులు ఆర్ధికంగా సాయం అందించేవారని ప్రశాంత్‌ చెబుతున్నాడు. తమ కుమారుడు మంచి రచయితగా, మంచి గాయకుడుగా అందరు గర్వించే విధంగా ఎదగాలని ప్రశాంత్‌ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు.

సమాజాన్ని మేల్కొలిపేలా పాటలు రాసి, వీడియోలు రూపొందిస్తున్న ప్రశాంత్‌

మంత్రి సీతక్క, జాతీయ అవార్డు

గ్రహీత సుద్దాల అశోకతేజచే ప్రశంసలు

పల్లెటూరి పిల్లగాడు.. పాటల్లో మొనగాడు1
1/3

పల్లెటూరి పిల్లగాడు.. పాటల్లో మొనగాడు

పల్లెటూరి పిల్లగాడు.. పాటల్లో మొనగాడు2
2/3

పల్లెటూరి పిల్లగాడు.. పాటల్లో మొనగాడు

పల్లెటూరి పిల్లగాడు.. పాటల్లో మొనగాడు3
3/3

పల్లెటూరి పిల్లగాడు.. పాటల్లో మొనగాడు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement