
ఆర్‌యూబీ పనుల్లో కదలిక
ఆలేరు: మున్సిపాలిటీ పరిధిలో రైల్వేగేట్ స్థానంలో నిర్మిస్తున్న రైల్వే అండర్ బ్రిడ్జి (ఆర్‌యూబీ) పనుల్లో కదలిక వచ్చింది.ఆర్‌యూబీ పనులు ప్రారంభించి ఆరేళ్లు గడిచినా నేటికీ పూర్తికాకపోవడంతో ప్రజలు రెండు కిలోమీటర్లు తిరిగి వెళ్లాల్సి వస్తుంది. ఈ క్రమంలో రాకపోకలు సాగించడానికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా పనుల అగ్రిమెంట్ గడువు కూడా ముగింపు దశకు చేరిన నేపథ్యంలో ‘మూడు నెలలే గడువు.. పనులేమో కదలవు’ శీర్షికతో శనివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. శనివారం రైల్వే జేఈ కరుణాకర్ పర్యవేక్షణలో రిటైనింగ్ వాల్ నిర్మాణానికి అడ్డంకిగా మారిన మిషన్ భగీరథ పైప్‌లైన్‌న షిఫ్టింగ్ పనులను ముమ్మరం చేశారు.

ఆర్‌యూబీ పనుల్లో కదలిక