
కలెక్టరేట్‌కు వచ్చిన దరఖాస్తుదారులు
భువనగిరి టౌన్ : భువనగిరిలో ఇళ్లు రాని పలువు రు దరఖాస్తుదారులు కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడానికి కలెక్టరేట్‌కు వచ్చారు. ఇళ్ల పంపిణీలో నిరుపేదలకు అన్యాయం జరిగిందని వాపోయారు.
ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా
ఆలేరురూరల్ : అర్హులందరికీ డబుల్ బెడ్‌రూం ఇళ్లు ఇవ్వాలని ఆలేరు తహసీల్దార్ కా ర్యాలయం ఎదుట శక్రవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో దరఖాస్తుదారులు ధర్నా చేశారు. ఈ సందర్భంగా సీపీఎం, బీజేపీ నాయకులు మాట్లాడుతూ జాబితాను దరఖాస్తుదారుల ఎదుట ప్రదర్శించకుండా తహసీల్దార్ ఆగమేఘాలమీద డ్రా తీశారని ఆరోపించారు. అర్హులకు న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో నా యకులు తునికి దశరథ, ఎంఏ ఎక్బాల్ ఉన్నారు. ఇదే సమయంలో అక్కడికి వచ్చిన బీఆర్‌ఎస్, సీపీఎం నాయకుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.