చౌటుప్పల్ : మండలంలోని పెద్దకొండూరు గ్రామ పంచాయతీ మదిర తమ్మలోనిబావికి చెందిన మహిళా ఆదర్శ రైతు వాకిటి రజితారెడ్డికి రాష్ట్రస్థాయి ఉత్తమ పురస్కారం లభించింది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో ఓ టీవీ చానల్ ఆధ్వర్యంలో అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. తెలంగాణ విద్యాశాఖ మంత్రి పి.సబితాఇంద్రారెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆర్‌కే.రోజాసెల్వమణిలు రజితారెడ్డికి పురస్కారం అందజేసి సన్మానించారు. పూర్తిగా సేంద్రియ పద్ధతుల ద్వారా పంటలు సాగు చేస్తున్నందున రజితారెడ్డిని పురస్కారానికి ఎంపిక చేశారు. ఈమెకు గతంలోనూ పలుమార్లు ఉత్తమ మహిళా రైతు అవార్డులు వచ్చాయి. పురస్కారం రావడం ఆనందంగా ఉందని రజితారెడ్డి తెలిపారు.