
ఉమ్మడి జిల్లాలోని నాలుగు గ్రామ పంచాయతీయలను రాష్ట్ర ప్రభుత్వం వివిధ విభాగాలలో ఉత్తమ పంచాయతీలుగా ఎంపిక చేసింది. ఈ మేరకు ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కార్యదర్శులకు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో పురస్కారాలను అందజేసింది. సోలార్ విద్యుత్ వినియోగంలో చౌటుప్పల్ మండలంలోని పంతంగి గ్రామం రాష్ట్ర స్థాయిలో నాల్గవ స్థానం పొందింది. బాలల హిత పంచాయతీ విభాగంలో మిర్యాలగూడ మండలం శ్రీనివాసనగర్ మూడోస్థానం, ‘స్వయం సమృద్ధి’ విభాగంలో రామన్నపేట మండలం వెల్లంకి గ్రామం రెండోస్థానం పొందాయి. అదేవిధంగా ‘మహిళా హితం’ విభాగంలో ఆత్మకూర్.ఎస్ మండలంలోని ఏపూర్ గ్రామం రెండో స్థానంలో నిలిచింది.
–సాక్షి నెటవర్క్


