గుండాల: మండలంలోని తుర్కలశాపురం గ్రామానికి చెందిన కొర్న దేవయ్య, కొర్న స్వామి, సురిగాల భిక్షం, బీసు సారమ్మ, జక్కుల స్వరూపలకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను సోమవారం బీఆర్‌ఎస్ నాయకులు స్థానికంగా అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నరేష్, పశుగణాభివృద్ధి సంస్థ డైరెక్టర్ ఇమ్మడి దశరథ గుప్తా, మోత్కూరు మార్కెట్ డైరెక్టర్ వంగూరి మల్లయ్య, సర్పంచ్ జక్కుల భిక్షమయ్య పాల్గొన్నారు.
తుర్కపల్లి: మండల కేంద్రంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన బాలయ్యకు, బద్దూతండాకు చెందిన గుగులోత్ విల, గుగులోత్ కోమటి, వేలు, హన్మంత్, మాదాపూర్‌కు చెందిన ధానవత్ లలిత, కడీలబావికి చెందిన పసుల కల్పన, సంగ్యాతండాకు చెందిన లలిత, గంధమల్ల గ్రామానికి చెందిన వేముల శ్రీనివాస్‌కు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను సోమవారం స్థానికంగా ఎంపీపీ భూక్యా సుశీల పంపిణీ చేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పిన్నపురెడ్డి నరేందర్‌రెడ్డి, పీసీసీ చైర్మన్ నర్సింహారెడ్డి, సెక్రటరీ జనరల్ శాగర్ల పరమేశ్‌యాదవ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ బద్దూనాయక్, మాజీ సర్పంచ్ హరినాయక్, నాయకులు భాస్కర్‌నాయక్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
మోత్కూరు: మండలంలోని పాటిమట్ల గ్రామానికి చెందిన దొండ యాదయ్యకు మంజూరైన సీఎంఆర్‌ఎఫ్ చెక్కును మార్కెట్ కమిటీ చైర్మన్ యాకూబ్‌రెడ్డి, మదర్ డెయిరీ డైరెక్టర్ రచ్చ లక్ష్మీనర్సింహారెడ్డి సోమవారం స్థానికంగా అందజేశారు. కార్యక్రమంలో సర్పంచ్ దండబోయిన మల్లేష్, రైతు సమన్వయ సమితి మండల కోఆర్డినేటర్ కొండా సోంమల్లు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పొన్నబోయిన రమేష్, కార్యదర్శి శ్రీనివాస్ పాల్గొన్నారు.
రామన్నపేట: పట్టణానికి చెందిన మోటె పద్మ, ఉగ్గె రాజు, బికాసబేగలకు సీఎం సహాయనిధి నుంచి మంజూరైన రూ.1,96,000 విలువ గల చెక్కులను సోమవారం స్థానికంగా బీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు పోతరాజు సాయి, ఎంపీటీసీ గొరిగె నర్సింహ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ పొడిచేటి కిషన్, రామిని రమేష్, జాడ సంతోష్, బొడ్డు అల్లయ్య, బాలగోని శివ, ఆముద లక్ష్మన్, అస్లాంబేగ్, అక్కెనపల్లి ప్రవీన్, అమర్, కృష్ణ, ఉపేందర్, ఖదీర్, లింగస్వామి రాము పాల్గొన్నారు.