
సత్యనారాయణశర్మకు అవార్డు అందజేస్తున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
భువనగిరి : పట్టణంలోని కృష్ణవేణి టాలెంట్ హైస్కూల్‌ను గురువారం విద్యాశాఖ, బాలల పరిరక్షణ విభాగం అధికారులు సందర్శించనున్నారు. విద్యార్థిని పట్ల పాఠశాల కరస్పాండెంట్ అసభ్యంగా ప్రవర్తించాడని ఆరోపిస్తూ వి ద్యార్థులు ఈనెల 21న పాఠశాల ఎదుట ధర్నా చేశారు. దీంతో సీడబ్ల్యూసీ అధికారులు విద్యా ర్థిని నుంచి వివరాలు సేకరించి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కరస్పాండెంట్‌తో పాటు ప్రిన్సిపాల్‌పై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. దీంతో పాఠశాల కొనసాగుతుందా లేదా అనే విషయంలో విద్యార్థులు అందోళన చెందుతున్నారు. వారికి భరోసా కల్పించి భయాందోళన పోగొట్టేందుకు అధికారులు నేడు పాఠశాలను సదర్శించనున్నారు. అలాగే విద్యా సంవత్సరం ఏప్రిల్ 23న ముగియనుంది. అప్పటి వరకు పాఠశాలను ఎలా నిర్వహించాలని అధికారులు చర్చించనున్నట్లు తెలిసింది.
యాదాద్రి పురోహితుడికి ఉగాది పురస్కారం
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధాన పురోహితుడు గౌరీభట్ల సత్యనారాయణశర్మకు ఉగాది పురస్కారం లభించింది. హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉగాది వేడుకల్లో దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి చేతుల మీదుగా పరస్కారం అందుకున్నారు.
నారసింహుడికిసంప్రదాయ పూజలు
యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో బుధవారం సంప్రదాయ పూజలు కొనసాగాయి. తెలుగు సంవత్సరం ఉగాది కావడంతో వేకువజామునే ఆలయాన్ని తెరచిన ఆచార్యులు సుప్రభాతం నిర్వహించారు. అనంతరం స్వయంభూలకు బిందే తీర్థం, ఆరాధన గావించారు. శ్రీస్వామి వారికి బాలభోగం చేపట్టిన తరువాత మూలవర్యులకు నిజాభిషేకం చేసి పట్టువస్త్రాలతో అలంకరించారు. శ్రీస్వామివారికి విశేషంగా సహస్రనామార్చన, అమ్మవారికి కుంకుమార్చన పూజలు చేపట్టారు. అనంతరం భక్తులకు శ్రీస్వామి వారి దర్శనం భాగ్యం కల్పించారు. ఇక ఆలయంలో సుదర్శన నారసింహ హోమం, బ్రహ్మోత్సవం, నిత్య కల్యాణం, తిరువీధి జోడు సేవలను నిర్వహించారు. రాత్రి పవళింపు సేవను నిర్వహించి, ఆలయాన్ని మూసివేశారు.
చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
బీబీనగర్ : వేసవిలో ప్రజల దాహార్తి తీర్చేందుకు ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాలను సద్వి నియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకుడు గూడూరు నారాయణరెడ్డి పేర్కొన్నారు. బీబీనగర్ మండలం గూడూరు పరిధిలోని టోల్‌ప్లాజా వద్ద జాతీయ రహదారికి ఇరువైపులా జీఎన్‌ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చల్లని మినరల్ వాటర్ చలి వేంద్రాలను బుధవారం ఆయన సినీ హీరోయిన్ అనుశ్రీ త్రిపాఠితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సౌకర్యార్థం అవసరం ఉన్న చోట ప్రతి వేసవిలో చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు పొట్టోళ్ల శ్యామ్‌గౌడ్, మండల అధ్యక్షుడు జంగారెడ్డి, ఉపాధ్యక్షుడు రాజు, నాయకులు వినయ్, సత్యం, శ్రీనివాస్‌రెడ్డి, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్న గూడూరు నారాయణరెడ్డి, హీరోయిన్ అనుశ్రీత్రిపాఠి

నిత్యకల్యాణం నిర్వహిస్తున్న ఆచార్యులు