చండూరు : మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రతిఘటించడానికి ఏప్రిల్ 5న చలో ఢిల్లీ నిర్వహిస్తున్నామని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు చినపాక లక్ష్మీనారాయణ, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు బండా శ్రీశైలం పిలుపునిచ్చారు. సీఐటీయూ, వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాల చండూర్ మండల కమిటీల ఆధ్వర్యంలో స్థానిక మార్కెట్ యార్డులో నిర్వహించి సదస్సుకు వారు ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడారు. సీఐటీయూ మండల కన్వీనర్ మోగుదాల వెంకటేశం, జెర్రిపోతుల ధనుంజయ్ గౌడ్, నరసింహ, వెంకన్న పాల్గొన్నారు.