పారిజాతగిరి శ్రీవారికి విశేష పూజలు | - | Sakshi
Sakshi News home page

పారిజాతగిరి శ్రీవారికి విశేష పూజలు

Oct 4 2026 10:55 AM | Updated on Oct 4 2026 10:55 AM

మద్యం మత్తులో తండ్రిపై కర్రతో దాడి ఉరి వేసుకుని యువకుడి మృతి

జంగారెడ్డిగూడెం(చింతలపూడి): స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శనివారం స్వామివారికి విశేష పూజలు చేశారు. భక్తులు గోవింద నామస్మరణతో గిరిప్రదక్షిణ చేశారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ అల్లూరి రామకృష్ణ, ఈఓ మణికల రాంబాబు భక్తులకు ఉచిత దర్శనం, ప్రసాదం, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. శనివారం ఆలయానికి రూ.1,39,900 ఆదాయం సమకూరిందని ఈఓ రాంబాబు వెల్లడించారు. ఈ నెల 5 నుంచి 8వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్టు అర్చకులు నల్లూరు రవికుమార్‌ తెలిపారు.

కుక్కునూరు: మద్యం మత్తులో ఉన్న కుమారుడు తండ్రిపై కర్రతో దాడి చేసిన ఘటనపై కుక్కునూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మండలంలోని బర్లమడుగు గ్రామానికి చెందిన కాక రాజులు (65) వ్యవసాయ కూలీగా జీవిస్తున్నారు. అక్టోబర్‌ 2వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో ఆయన ఇంట్లో నిద్రిస్తుండగా, కుమారుడు కాక బాబు రావు అలియాస్‌ బాబు (40) మద్యం మత్తులో వచ్చి తండ్రిని అసభ్య పదజాలంతో దూషించాడు. అంతటితో ఆగకుండా ఇంట్లోని కట్టెతో దాడి చేయడంతో రాజులు ఎడమ చేతికి, తల ఎడమ వైపు తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. బాధితుడి ఫిర్యాదు మేరకు కుక్కునూరు పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గాయపడిన బాధితుడిని వైద్య చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుడిపై చట్టపరంగా తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

తణుకు అర్బన్‌: అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పాతవూరు ఎన్టీఆర్‌ పార్కు వెనుక నివాసం ఉంటున్న జ్వాల సాయి సతీష్‌కుమార్‌ (20) హైదరాబాదులో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల తణుకు వచ్చిన అతడు శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సంఘటనా స్థలాన్ని తణుకు పట్టణ సీఐ జేవీ రమణ, ఎస్సై సత్యనారాయణ సందర్శించి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement