న్యూస్‌రీల్
నియోజకవర్గ కేంద్రం ఉండిలోని ఈ చిత్రాన్ని గమనించారా? ఇక్కడి హైస్కూల్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఉన్న డంపింగ్ యార్డు, వర్మీ కంపోస్టు షెడ్లు పూర్తిగా నిరుపయోగంగా మారాయి. గ్రామంలో సేకరించిన చెత్తను ఆర్‌అండ్‌బీ రోడ్డు పక్కనే వేస్తున్నారు. ప్రస్తుతం రైల్వే గేట్ పనుల వల్ల జాతీయ రహదారిని మూసివేయడంతో, ప్రయాణికులు ఈ చెత్త కుప్పల మధ్య నుంచే ముక్కు మూసుకుని ప్రయాణించాల్సి వస్తోంది.
ఆర్‌ఎంపీ అరెస్ట్
మత్తు ఇంజెక్షన్ల కేసులో కుక్కునూరు మండలానికి చెందిన ఆర్‌ఎంపీను అరెస్ట్ చేసినట్లు జంగారెడ్డిగూడెం సీఐ ఎంవీ సుభాష్ వెల్లడించారు. 8లో u
బుధవారం శ్రీ 16 శ్రీ సెప్టెంబర్ శ్రీ 2026
సాక్షి, భీమవరం: ప్రభుత్వం ఎంతో ఆర్బాటంగా ప్రచారం చేస్తున్న ‘స్వర్ణ ఆంధ్ర–స్వచ్ఛ ఆంధ్ర’ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ప్రకటనలకే పరిమితమవుతోంది. జిల్లాలోని 409 పంచాయతీలు, ఐదు పట్టణాలు, ఒక నగర పంచాయతీ పరిధిలో 60 శాతానికి పైగా గ్రామాల్లో చెత్త తరలింపునకు తగిన స్థలాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దాంతో శివార్లలోని రోడ్డు మార్జిన్లు, కాలువ గట్లే డంపింగ్ యార్డులుగా మారుతున్నాయి. మరోవైపు లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించిన ‘చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు’ (సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ షెడ్లు) పర్యవేక్షణ లోపంతో నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి.
వినియోగానికి నోచుకోని వర్మీ కంపోస్టు షెడ్లు
తడిచెత్త నుంచి వర్మీ కంపోస్టు తయారుచేసి విక్రయించడం ద్వారా పంచాయతీలకు అదనపు ఆదాయం సమకూర్చాలన్నది ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. అయితే జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లోనూ ఈ వ్యవహారం నీరుగారిపోయింది.
తీవ్రమైన సిబ్బంది, నిధుల కొరత
ప్రతి నెలా 4వ శనివారం ‘ప్రత్యేక పారిశుద్ధ్య నిర్వహణ’ పేరిట ప్రభుత్వం హడావుడి చేస్తున్నా, పంచాయతీలకు అవసరమైన సిబ్బంది నియామకానికి, సామాగ్రి కొనుగోలుకు నిధులు కేటాయించడం లేదని సిబ్బంది వాపోతున్నారు. అలాగే నిబంధనల ప్రకారం ప్రతి 250 కుటుంబాలకు ఒక గ్రీన్ అంబాసిడర్‌ను నియమించాల్సి ఉండగా, చాలా గ్రామాల్లో సగం మంది కూడా లేరు. పంచాయతీల ‘జనరల్ ఫండ్స్’ నిధులు వీధి లైట్లు, తాగునీరు, పారిశుద్ధ్య నిర్వహణకే సరిపోవడం లేదు. ఐవీఆర్‌ఎస్ ప్రజాభిప్రాయ సేకరణ, ఉన్నతాధికారుల ఒత్తిళ్ల కారణంగా పంచాయతీ కార్యదర్శులు, సిబ్బంది సొంత నిధులు వెచ్చించి పనులు చేయించాల్సి వస్తోంది.
మురుగునీటి అంతరాయం.. పెరిగిన ప్రమాదాలు
డంపింగ్ యార్డులు లేకపోవడంతో కాలువ గట్లపై వేస్తున్న చెత్త నీటిలోకి చేరి తీవ్ర కాలుష్యానికి కారణమవుతోంది. ఇది నీటి ప్రవాహానికి ఆటంకం కలిగించి సాగు, మురుగునీరు నిలిచిపోయేలా చేస్తోంది. దుర్గంధం రాకుండా గ్రీన్ మ్యాట్లు కడుతున్నా ఫలితం ఉండడం లేదు. రోడ్ల పక్కన పారబోసిన చెత్తకు నిప్పు పెడుతుండటంతో దట్టమైన పొగ కమ్ముకుని వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. అధికారులు కేవలం ప్రచారానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్య నిర్వహణకు తగిన స్థలాలు కేటాయించి, షెడ్లను పునరుద్ధరించాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.
ఉండిలోని హైస్కూల్, పీహెచ్‌సీ సమీపంలో పేరుకుపోయిన చెత్త
రాచర్లలో తాళం వేసిన చెత్త సంపద కేంద్రం
పెంటపాడు మండలం రాచర్లలోని సంపద కేంద్రానికి గత కొంతకాలంగా తాళాలు వేసి ఉంచారు. హెచ్చరిక బోర్డులు ఉన్నప్పటికీ చెత్తను మిడ్‌లెవిల్ కాలువ గట్టుపై పారబోస్తున్నారు. వల్లూరుపల్లి, దర్శిపర్రు గ్రామాల్లో ప్రధాన రహదారి వెంబడే చెత్తను వేస్తున్నారు. అలాగే బి.కొండేపాడులో డంపింగ్ యార్డు లేక మీనవిల్లూరు వైపు వెళ్లే రహదారిపై చెత్త పారబోస్తుండగా, మీనవిల్లూరు, రామచంద్రపురం గ్రామాల్లో యనమదుర్రు గట్టుపై వేసి తగలబెడుతున్నారు.
నిరుపయోగంగా ‘సంపద’ కేంద్రాలు
రోడ్లపైనే చెత్త కుప్పలు
జిల్లాలో మరుగునపడిన స్వచ్ఛతా లక్ష్యాలు
నిర్వహణ లోపంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా వర్మీ కంపోస్టు షెడ్లు
సిబ్బంది, నిధుల కొరతతో చేతులెత్తేస్తున్న పంచాయతీలు


