● ప్రభుత్వాసుపత్రిలో నరకమే | - | Sakshi
Sakshi News home page

● ప్రభుత్వాసుపత్రిలో నరకమే

May 22 2026 5:40 AM | Updated on May 22 2026 5:40 AM

● ప్రభుత్వాసుపత్రిలో నరకమే

రోగుల బంధువులే స్కానింగ్‌, ఎక్స్‌రే వార్డులకు తీసుకెళ్తున్న దృశ్యం

పేద మధ్యతరగతి వారికి ప్రభుత్వాసుపత్రే దేవాలయం. ఆసుపత్రికి వస్తే అన్ని రకాలుగా వైద్యం సకాలంలో అందుతుందనేది పాత మాట. ఇప్పుడు ఎందుకు వచ్చాం రా.. భగవంతుడా అన్నట్లు తయారైంది ఏలూరు సర్వజన ఆసుపత్రి. రోగులను ఎక్స్‌రేకు తీసుకెళ్లాలన్నా... రక్తనమూనాకు తీసుకెళ్లాలన్నా, స్కానింగ్‌ వార్డుకు తీసుకెళ్లాలన్నా రోగి బంధువులు నరకం చూడాల్సిందే. స్ట్రెచర్‌, వీల్‌చైర్‌పై తీసుకువెళ్ళాలంటే నానా యాతన పడుతున్నారు. ఆసుపత్రి సహాయ ఉద్యోగులు స్పందించకపోవడంతో వారి బంధువులే అవస్థలు పడుతున్నారు. గురువారం ప్రభుత్వాసుపత్రిలో కనిపించిన దృశ్యాలివి. – సాక్షి ఫొటోగ్రాఫర్‌/ఏలూరు

వీల్‌ చైర్‌ లేక మనవరాలి సాయంతో నడుస్తున్న వృద్ధురాలు, రోగిని తీసుకెళ్తున్న బంధువు

Advertisement
 
Advertisement
Advertisement