అధికారం అండతో కూటమి నేతల ఆగడాలు పెచ్చుమీరాయి. ఉంగుటూరు మండలం కై కరంలో జాతీయరహదారిని ఆనుకుని 45 సెంట్ల భూమిని మెరక చేస్తున్నారు. 8లో u
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చిన్నవెంకన్న దేవస్థానంలో ఉద్యోగుల అంతర్గత బదిలీలు చేస్తు న్నారు. ఆలయంలో ఇటీవల జరిగిన రూ.200 నకిలీ టికెట్ల స్కాం నేపథ్యంలో నగదు లావాదేవీలు జరిగే ప్రదేశాల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నియమించరాదని దేవదాయ శాఖ కమిషనర్ సర్క్యులర్ ఉన్నా.. అధికారులు బేఖాతరు చేస్తున్నారని ఈనెల 17న సాక్షి దినపత్రికలో శ్రీవారి సొమ్ము ‘అవుట్’ సోర్సింగ్ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన దేవస్థానం ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్‌ఎన్ నివృతరావుల ఆదేశాల మేరకు ఆలయ ఈఓ వై.భద్రాజీ ఉద్యోగుల అంతర్గత బదిలీలకు చర్యలు చేపట్టారు. అందులో భాగంగా గత ఆదివారం కొదరు రెగ్యులర్, ఎన్‌ఎంఆర్ ఉద్యోగులను నగదు లావాదేవీలు జరిగే ప్రదేశాల్లో నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అవుట్ సోర్సింగ్ సిబ్బందిని బదిలీ చేయాల్సి ఉంది.


