అంగన్‌వాడీ కేంద్రాలకు ధరల మంట | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీ కేంద్రాలకు ధరల మంట

Mar 14 2026 8:39 AM | Updated on Mar 14 2026 8:39 AM

వండలేక.. సొమ్ములు చాలక..

నూజివీడు: మాతా శిశుమరణాలను తగ్గించడంతో పాటు, బాలల భవిష్యత్‌కు పునాదులు వేసే అంగన్‌వాడీ కేంద్రాలపై చంద్రబాబు సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలకు ఇచ్చే మెనూ చార్జీలను పెంచకుండా తాత్సారం చేస్తోంది. నిత్యావసరాల ధరలు, కూరగాయల ధరలు పెరుగుతున్నా అందుకు అనుగుణంగా మెనూ చార్జీలు పెంచకపోవడంతో ప్రతి నెలా అంగన్‌వాడీ వర్కర్లపై భారం పడుతోందని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ, అభివృద్ధికి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో ఉన్న ధరలకు అనుగుణంగా చెల్లింపులు చేయకపోవడంతో కేంద్రాల నిర్వహణలో వర్కర్లకు చేతి చమురు వదులుతోంది. వీటికి తోడు అంగన్‌వాడీ వర్కర్ల, జీతాల పెంపుదల విషయంలో కూడా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆవేదన వ్యక్తమవుతోంది. దీంతోనే ఇటీవల ఆందోళనలు సైతం చేశారు.

10 ప్రాజెక్టులు.. 2,226 కేంద్రాలు

మహిళాభివృద్ధి, సీ్త్ర శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా వ్యాప్తంగా 10 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 2226 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో 1,01,224 మంది లబ్ధిదారులున్నారు. వీరిలో 6 నెలలలోపు పిల్లలు 7,210 మంది, 6 నెలల నుంచి మూడేళ్లలోపు పిల్లలు 41,277 మంది, మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 37,174 మంది, గర్భిణులు 8,179 మంది, బాలింతలు 7,384 మంది ఉన్నారు. మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే వంట చేసి పెడుతుండగా.. గర్భిణులు, బాలింతలకు, మూడేళ్లలోపు పిల్లలకు ఇంటికే రేషన్‌ పంపిస్తున్నారు. అందుకు గాను అంగన్‌వాడీ కేంద్రాలకు ప్రభుత్వం బియ్యం, నూనె, కందిపప్పు, కోడిగుడ్లు, పాలు సరఫరా చేస్తోంది. అంగన్‌వాడీ కేంద్రంలో భోజనం చేసే చిన్నారులు ఒక్కొక్కరికీ ఐదు గ్రాముల చొప్పున నూనెను ఇస్తోంది.

కాలానుగుణంగా నిత్యావసరాల ధరలు, కూరగాయల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో పాటు వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర సైతం పెరుగుతోంది. వీటికి అనుగుణంగా ప్రభుత్వం మెనూ చార్జీలను పెంచకుండా గత ప్రభుత్వంలో 2023లో నిర్ణయించిన ధరలనే ఇప్పటికీ అమలు చేస్తోంది. పెరిగిన ధరలతో నిర్దేశించిన మెనూ ప్రకారం చిన్నారులకు వండి వడ్డించాలంటే వర్కర్లు నానా పాట్లు పడుతున్నారు. మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు అంగన్‌వాడీ కేంద్రంలోనే వండాల్సి ఉండటంతో కూరగాయలు, పసుపు, కారం, ఆకుకూరలు, ఉల్లిపాయలు, పోపు దినుసులు తదితర సామగ్రిని ఎప్పటికప్పుడు కొనుగోలు చేయాలి. మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలకు ఒక్కొక్కరికి రోజుకు కేవలం ట్రాన్స్‌పోర్ట్‌ ఖర్చుతో కలిపి రూ.2.10 మాత్రమే ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇందులోనే 50 పైసలు గ్యాస్‌కు, రేషన్‌ దుకాణాల నుంచి సరుకులు తెచ్చుకునేందుకు 10 పైసలు కేటాయించింది. అంటే కూరగాయలు తదితర సామగ్రి కోసం ఒక్కో పిల్లవాడికి రోజుకు కేటాయించింది కేవలం రూ.1.50 పైసలు మాత్రమే. దీంతో పిల్లవాడికి పౌష్టికాహారం పెట్టడం ప్రశ్నార్థకంగా మారింవది. దీనికి తోడు గ్యాస్‌ సిలిండర్‌కు ప్రభుత్వం ఇచ్చే సొమ్ము సరిపోవడం లేదని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొరగా ఇచ్చే మెనూ చార్జీల బిల్లులు కూడా రెగ్యులర్‌గా రావని, ఆరు నెలలు, ఏడాదికోసారి ఇస్తుండటంతో వర్కర్లు తమ జేబులో నుంచే పెట్టుబడి పెట్టాల్సిన దుస్థితి ఎదురవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఇచ్చే మెనూ చార్జీలు ఎందుకూ చాలడం లేదని వర్కర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వంట.. తంటా

పెరగని మెనూ చార్జీలు

పెరిగిన నిత్యావసరాల ధరలు

కేంద్రాల నిర్వహణ భారం

ఇప్పటికీ 2023లో ధరలే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement