జాతర వెలుగులు | - | Sakshi
Sakshi News home page

జాతర వెలుగులు

Mar 10 2026 7:06 AM | Updated on Mar 10 2026 7:06 AM

పట్టణ ఇలవేల్పు బలుసులమ్మ తల్లి జాతర వెలుగులతో తాడేపల్లిగూడెం విద్యుత్‌ కాంతులతో ధగధగలాడుతోంది. విద్యుత్‌ దీపాలతో పాటు దేవతామూర్తుల కటౌట్‌లు ఆకట్టుకుంటున్నాయి. జయలక్ష్మీ ఽ సెంటర్‌ సమీపంలో త్రిలోక సంచారి శివయ్య లైట్ల కాంతులతో ఆకర్షిస్తున్నారు. పోలీసు ఐలాండ్‌ సెంటర్‌లో గోవా సుందర దృశ్యాన్ని స్పురణకు తెస్తూ పెట్టిన లైటింగ్‌ కనులవిందు చేస్తోంది. ఫ్‌లైఓవర్‌ బ్రిడ్జికి ఒక భాగంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి, మరోపక్క నాగలోకం ఆకట్టుకుంటోంది.

– తాడేపల్లిగూడెం

Advertisement
 
Advertisement
Advertisement