జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

Jan 8 2026 6:22 AM | Updated on Jan 8 2026 6:22 AM

జాతీయ

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక జేసీబీ, టిప్పర్‌ లారీ సీజ్‌ వేధింపుల కేసు నమోదు సీఎం సమీక్ష రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి యథేచ్ఛగా కోళ్ల వ్యర్థాల తరలింపు

భీమడోలు: మధ్యప్రదేశ్‌ భోపాల్‌లో జరిగిన 68వ జాతీయ రైఫిల్‌ షూటింగ్‌ చాంపియన్‌షిఫ్‌లో సూరప్పగూడేనికి చెందిన వెజ్జు ధరియా జూనియర్‌ కేటగిరిలో ప్రతిభ చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై ంది. ఈ ఏడాది చివరిలో జరిగే నేషనల్స్‌ పోటీల్లో విజేతగా నిలిస్తే ఇండియన్‌ టీంలో స్థానం పొందుతుందని తండ్రి సోము తెలిపారు. చిన్నతనం నుంచి షూటింగ్‌ పట్ల ఆసక్తిని పెంచుకుని, అలుపెరుగని శ్రమతో తన లక్ష్యం వైపు ముందుకు సాగుతున్న ధరియా యువతకు ఆదర్శంగా నిలుస్తోంది. మాజీ సర్పంచ్‌ వెజ్జు సూర్యకుమారి, కొండలరావు మనవరాలు ధరియా గుంటూరులోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఏడో తరగతి చదువుతుంది. ఆమెను పలువురు అభినందించారు.

కొయ్యలగూడెం: మట్టిని అక్రమంగా తరలిస్తున్న జేసీబీని, టిప్పర్‌ లారీని స్వాధీనం చేసుకుని సీజ్‌ చేసినట్లు తహసీల్దార్‌ ఎన్‌.నాగరాజు తెలిపారు. యర్రంపేట సమీపంలోని పులపాల చెరువులో బుధవారం అదే గ్రామానికి చెందిన వ్యక్తి జేసీబీని ఏర్పాటు చేసి లారీల్లో మట్టిని తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో పీడబ్ల్యూడీ ఏఈ ఎంఆర్‌ భాస్కర్‌తో కలిసి దాడి చేసినట్లు తహసీల్దార్‌ చెప్పారు. ఈ సమయంలో జేసీబీ, ఒక టిప్పర్‌ లారీని పట్టుకుని కొయ్యలగూడెం పోలీస్‌ స్టేషన్‌కి తరలించినట్లు తెలిపారు.

జంగారెడ్డిగూడెం: భర్త, అతని కుటుంబ సభ్యులపై ఓ వివాహిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎంవీ ప్రసాద్‌ తెలిపారు. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం గ్రామానికి చెందిన గంజి వనజకు జోషిబాబుతో 2024 జనవరిలో గన్నవరంలో వివాహమైంది. వివాహ సమయంలో రూ.5 లక్షల నగదు, 6 కాసుల బంగారం, చీర సారె కింద రూ.2 లక్షలు కట్నంగా ఇచ్చారు. చెడు వ్యసనాలకు బానిసైన జోషిబాబు వివాహమైన కొద్దిరోజుల నుంచి భార్య వనజను శారీరికంగా, మానసికంగా వేధిస్తున్నాడు. దీనికి అతని కుటుంబ సభ్యులు ఆరుగురు సహకరిస్తున్నట్లు బాధితురాలు వనజ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు.

పోలవరం రూరల్‌: పోలవరం ప్రాజెక్ట్‌ మొదటి దశ నిర్మాణ పనులన్నీ 2027 మార్చికి పూర్తిచేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబాబు నాయుడు ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం పోలవరం ప్రాజెక్ట్‌ పనులను అధికారులు, ఇంజనీరింగ్‌ సిబ్బందితో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ప్రాజెక్ట్‌ సైట్‌లోని సమావేశపు హాలులో సమీక్షించారు. ప్రాజెక్టు పనులు, పునరావాస ప్యాకేజీ తదితర అంశాలపై చర్చించారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా రూపొందించాలని సూచించారు. మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.

పెదపాడు: రోడ్డు ప్రమాదంలో మంగళవారం రాత్రి ఓ వ్యక్తి మృతి చెందాడు. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తిరుపతి జిల్లా, నారాయణవనం మండలంలోని జంగంపల్లి గ్రామానికి చెందిన కుంభ విజయ్‌ ఈనెల 6వ తేదీన మోటారు సైకిల్‌పై విశాఖపట్నం నుంచి విజయవాడ వైపు వెళ్తుండగా రాత్రి 8.30 గంటల సమయంలో స్థానిక రామచంద్ర ఇంజనీరింగ్‌ కళాశాల వద్దకు వచ్చేసరికి డివైడర్‌ను ఢీకొట్టాడు. దీంతో తలకి బలమైన గాయం కావడంతో జాతీయ రహదారి అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రాత్రి 11 గంటల సమయంలో చికిత్స పొందుతూ మృతిచెందాడు. వీఆర్వో రాగాల కృష్ణ ఫిర్యాధు మేరకు పెదపాడు ఎస్సై కట్టా శారదా సతీష్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఆగిరిపల్లి: మండలంలో ఇష్టానుసారంగా చేపల చెరువుల కోసం కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఆగిరిపల్లి చుట్టుపక్కల గ్రామాల్లో పదుల సంఖ్యలో మాంసం దుకాణాలు ఉన్నాయి. ప్రతిరోజు చికెన్‌ దుకాణాల వద్ద నుంచి చేపల చెరువుల నిమిత్తం కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్నారు. ఈ తతంగం మొత్తం ఉదయం పూట జరుగుతున్నా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. కోళ్ల వ్యర్థాలను తరలించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక 1
1/2

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక 2
2/2

జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement