రెడ్ సిగ్నల్ పడితే మాకేంటి!
ఏలూరు నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు, క్రమబద్ధీకరణకు ట్రాఫిక్ పోలీసులు అనేక చర్యలు చేపడుతున్నా వాహనదారులు మాత్రం రూల్స్ పాటించడం లేదు. సిగ్నల్ రూల్స్ సైతం పాటించకుండా ఇష్టారాజ్యంగా ప్రయాణం సాగిస్తూ ప్రమాదాలకు ఎదురు వెళుతున్నారు. రెడ్ సిగ్నల్ పడినా పట్టించుకోకుండా వెళ్లిపోవడం.. ఆపిన కానిస్టేబుల్‌తో వాగ్విదానికి దిగడం షరా మాములైపోయింది. రూల్స్ పాటించండి.. క్షేమంగా ఇంటికి వెళ్లండి అంటూ ఎన్ని అవగాహన కార్యక్రమాలు పెట్టినా మనకేమిటిలే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఏలూరు ప్రధాన కూడలి అయిన ఫైర్‌స్టేషన్ సెంటర్, పాతబస్టాండ్ సెంటర్‌లో సిగ్నల్ పడినా ఆగకుండా ప్రయాణాలు సాగిస్తున్న దృశ్యాలు ఇవి.
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు


