ఏపీఎన్‌జీజీఓ సంఘ కార్యవర్గం ఏకగ్రీవం
ఏలూరు(మెట్రో): ఏపీఎన్‌జీజీఓ అసోసియేషన్ ఏలూరు జిల్లా కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. సోమవారం స్థానిక డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్‌లో ఎన్నికలు నిర్వహించగా ఒక్కో పోస్టుకు ఒక్కో అభ్యర్థి మాత్రమే నామినేషన్ దాఖలు చేశారు. దీంతో జిల్లా కార్యవర్గం ఏకగ్రీవమైందని, మొత్తం 17 మంది ఎన్నికై నట్టు ఎన్నికల అధికారి కె.శరత్‌బాబు ప్రకటించారు. జిల్లా అధ్యక్షుడిగా చోడగిరి శ్రీనివాసరావు (జలవనరుల శాఖ), సహాధ్యక్షుడిగా నోరి శ్రీనివాసరావు (జలవనరులు) , ఉపాధ్యక్షులుగా ఎం.ఫణికుమార్ (పశు సంవర్ధక), ఏవీవీయల్ నరసింహారావు (మున్సిపల్), బి.లక్ష్మీపతి (రాష్ట్ర ఆడిట్), పూడి శ్రీనివాస్ (బీసీ వెల్ఫేర్), ఎండీ రెహమాన్ (సహకార), ఉపాధ్యక్షురాలి గా ఎం.లీలారాణి ఎన్నికయ్యారు. అలాగే సెకండరీ హెల్త్ కార్యదర్శిగా నెరుసు వెంకటరామారావు (వైద్య ఆరోగ్య), కార్యనిర్వాహక కార్యదర్శిగా బి.నరేంద్ర బాబు (వైద్య ఆరోగ్య), సంయుక్త కార్యదర్శులుగా ఎం.సాంబశివరావు (పబ్లిక్ హెల్త్), ఎండీ ఖాదర్ బేగ్ (వ్యవసాయ), కె.ఉమామహేశ్వరరావు (వైద్యారోగ్య), కె.కనికరాజు (పంచాయతీరాజ్), ఎంవీఎన్‌ఎల్ తులసి (వైద్యారోగ్యశాఖ), సంయుక్త కార్యదర్శిగా (మహిళ) ఎన్.ఝాన్సీ లక్ష్మీబాయి (బీసీ వెల్ఫేర్), కోశాధికారిగా వి.శ్రీనివాసరావు (స్టేట్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రకాశం జిల్లా అధ్యక్షుడు కె.శరత్‌బాబు, ప్రకాశం జిల్లా కార్యదర్శి ఆర్‌సీహెచ్ కృష్ణారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఎం.రంజిత్‌నాయుడు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల సభ్యులు పాల్గొన్నారు.


