త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు
భీమవరం: భీమవరం త్యాగరాజ భవనంలో త్యాగరాజ స్వామి 107వ ఆరాధనోత్సవంలో భాగంగా సోమవారం చైన్నెకు చెందిన ప్రముఖ సంగీత విద్వాంసులు పతంగి బ్రదర్స్ గాత్ర కచేరి ఆకట్టుకుంది. ముందుగా త్యాగరాజ ఆరాధనోత్సవాల అధ్యక్షుడు ఉద్దరాజు కాశీ విశ్వనాథ్ రాజు, గౌరవాధ్యక్షుడు గంధం విశ్వేశ్వరరావు, ఉపాధ్యక్షుడు గన్నబత్తుల శ్రీనివాసరావు, ఎన్‌ఆర్ కే రాజులు జ్యోతి ప్రజ్వలన చేశారు. ధాత్రే ఎస్ పతంగి, ధ్రువ ఎస్ పతంగి ఆలపించిన త్యాగరాజ కృతులు, అన్నమయ్య పదాలు అలరించాయి. కారుమూరి ఆదిత్య, చెరుకువాడ వెంకట్రామయ్య, కారుమూరి నరసింహమూర్తి, వబిలిశెట్టి కనకరాజు, వబిలిశెట్టి శ్రీవెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


