పేకాట నిర్వాహకులకు మూడేళ్ల జైలు | - | Sakshi
Sakshi News home page

పేకాట నిర్వాహకులకు మూడేళ్ల జైలు

Jan 6 2026 8:04 AM | Updated on Jan 6 2026 8:04 AM

పేకాట

పేకాట నిర్వాహకులకు మూడేళ్ల జైలు

పేకాట నిర్వాహకులకు మూడేళ్ల జైలు సాఫ్ట్‌బాల్‌ పోటీలకు ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల ఎంపిక చీరల దొంగల ముఠా అరెస్ట్‌ 7న చంద్రబాబు పోలవరం రాక లారీల బీభత్సం

మండవల్లి: సంక్రాంతి పండుగకు ఎవరూ కోడి పందేలు, పేకాట నిర్వహించవద్దని, పేకాట నిర్వాహకులకు 3 ఏళ్ల జైలు శిక్ష పడుతుందని ఎస్‌ఐ సీహెచ్‌ఎస్‌ రామచంద్రరావు అన్నారు. శ్రీ నాగేంద్రస్వామి ఆలయ ఆవరణలో కోడి పందేలు, పేకాట వంటి అసాంఘిక కార్యక్రమాలపై సోమవారం గ్రామస్తులకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన పెంచుకోవాలని, వాహనదారులు హెల్మెట్‌ పెట్టుకోవాలని పేర్కొన్నారు.

నూజివీడు: ఆలిండియా సాఫ్ట్‌బాల్‌ ఇంటర్‌ యూనివర్శిటీ పోటీలకు ట్రిపుల్‌ ఐటీ బాల బాలికల జట్లను ఎంపిక చేశారు. జట్టులో నూజివీడు ట్రిపుల్‌ ఐటీకి చెందిన మేఘన, అమృత, భాగ్యశ్రీ, తేజస్విని, దివ్య, సంధ్యారాణి ఎంపికయ్యారు. బాలుర జట్టుకు గణేష్‌, రామ్‌ ప్రసాద్‌, రాంబాబు, పరమేష్‌, రాజేష్‌, లోవరాజు, కోటిరెడ్డి ఎంపికయ్యారు. బాలుర జట్టు వచ్చే నెల 1 నుంచి 5 వరకు మహారాష్ట్రలో నిర్వహించే పోటీలకు హాజరుకానున్నారు. బాలికల జట్టు 6 నుంచి 10 వరకు నిర్వహించే పోటీల్లో పాల్గొననున్నారు. హ్యాండ్‌బాల్‌ సౌత్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్శిటీ పోటీల కోసం జ్ఞానేంద్ర, రాజు ఎంపికయ్యారు.

భీమవరం: పట్టణంలోని హన్సీ కల్యాణ మండపంలో చీరల ఎబ్జిబిషన్‌లో చీరలు దొంగతనం చేసిన నలుగురు మహిళలను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రఘువీర్‌ విష్ణు చెప్పారు. సోమవారం టూటౌన్‌ పోలీసుస్టేషన్‌లో విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. పట్టణంలో ఈ నెల 3న చీరల ఎగ్జిబిషన్‌ ఏర్పాటుచేయగా 4న కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం కొండపల్లికి చెందిన మేడారపు రజనీ, పొన్న చుక్కమ్మ, పొన్నూరు మల్లి, మేడారపు లక్ష్మి ఎగ్జిబిషన్‌ తిలకించడానికి వచ్చి సుమారు రూ.80 వేలు చీరలను దొంగిలించారు. ఎగ్జిబిషన్‌ నిర్వాహకురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేయగా నిందితులను గొల్లవానితిప్ప రోడ్డులో సోమవారం అరెస్ట్‌ చేసి వారి నుంచి చీరలను స్వాధీనం చేసుకున్నారు.

పోలవరం రూరల్‌: ఈ నెల 7న సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలనకు రానున్నారని కలెక్టర్‌ కె.వెట్రిసెల్వి తెలిపారు. దీనికి సంబంధించి పటిష్ట ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. సీఎం పర్యటన ఏర్పాట్లపై ఎస్పీ కె.ప్రతాప్‌ శివకిషోర్‌తో కలిసి ఆమె సోమవారం పరిశీలించారు. అనంతరం ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.

భీమవరం: భీమవరంలో బుధవారం రెండు లారీలు బీభత్సం సృష్టించాయి. ఆగి ఉన్న మినీ లారీని మరో లారీ ఢీకొట్టింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం భీమవరం బలుసుమూడి ప్రాంతంలోని ఒక మద్యం దుకాణం వద్ద మద్యం దింపేందుకు మినీ లారీ ఆగింది. ఆ సమయంలో వెనకనుంచి వస్తున్న మరో లారీ ఆ లారీని ఢీకొంది. ఆగి ఉన్న మినీలారీ వేగంగా వెళ్లి రెండు ద్విచక్ర వాహనాలను ఢీకొని, రోడ్డు మార్జిన్‌లో దిగబడి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి.

పేకాట నిర్వాహకులకు మూడేళ్ల జైలు 
1
1/4

పేకాట నిర్వాహకులకు మూడేళ్ల జైలు

పేకాట నిర్వాహకులకు మూడేళ్ల జైలు 
2
2/4

పేకాట నిర్వాహకులకు మూడేళ్ల జైలు

పేకాట నిర్వాహకులకు మూడేళ్ల జైలు 
3
3/4

పేకాట నిర్వాహకులకు మూడేళ్ల జైలు

పేకాట నిర్వాహకులకు మూడేళ్ల జైలు 
4
4/4

పేకాట నిర్వాహకులకు మూడేళ్ల జైలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement