హోరాహోరీగా కబడ్డీ పోటీలు
వీరవాసరం: కొల్లా భాస్కరమ్మ, గుండా లక్ష్మీ రత్నావతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో వీరవాసరంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ఆదివారం హోరాహోరీగా సాగాయి. 25 జిల్లాల నుంచి జట్లు తలపడ్డాయి. ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో పాల్గొని పోటీలను తిలకించారు. ఈ పోటీల్లో కృష్ణా, ఎన్టీఆర్, అనంతపురం, విజయనగరం జిల్లా జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధించాయి.
తూర్పుగోదావరి– కర్నూలు జట్ల మధ్య జరిగిన పోటీలో కర్నూలు జట్టు విజయం సాధించింది. కాకినాడ– ఏలూరు జట్ల మధ్య పోటీలో కాకినాడ, పశ్చిమగోదావరి– తిరుపతి మధ్య పోటీలో పశ్చమ గోదావరి జట్టు విజయం సాధించింది. విశాఖపట్నం–అన్నమయ్య జిల్లాల మధ్య జరిగిన పోటీల్లో అన్నమయ్య జట్లు విజయం సాధించింది.
గుంటూరు– పల్నాడు జిల్లా మధ్య పోటీలో పల్నాడు, శ్రీకాకుళం– కడప మధ్య పోటీలో శ్రీకాకుళం విజయం సాధించారు. సత్య సాయి జిల్లాపై కృష్ణ, తూర్పుగోదావరిపై అనంతపురం, ఏలూరుపై పశ్చిమ గోదావరి, తిరుపతిపై కాకినాడ జట్లు గెలుపొందాయి. నంద్యాలపై పల్నాడు జట్టు, కడపపై బాపట్ల, సత్యసాయిపై నెల్లూరు విజయం సాధించింది. కర్నూలుపై అనంతపురం, ఏలూరుపై తిరుపతి, నంద్యాలపై గుంటూరు, చిత్తూరుపై ఎన్టీఆర్ జిల్లా విజయం సాధించింది. విజయనగరం– ప్రకాశం జట్ల మధ్య జరిగిన పోటీల్లో విజయనగరం 18 పాయింట్లతో, నెల్లూరు–కృష్ణా మ్యాచ్‌లో కృష్ణా జట్టు 32 పాయింట్లతో విజయం సాధించింది.


