పశువుల పాక దగ్ధం
పెంటపాడు: మండలంలోని కె.పెంటపాడులో సోమవారం రాత్రి ప్రమాదవశాత్తూ అగ్నిప్రమాదంలో పశువుల పాక దగ్ధమైంది. దోమల కోసం పెట్టిన పొగ రాజుకొని ఈ ప్రమాదం సంభవించినట్లు స్థానికులు చెబుతున్నారు. ఆ సమయంలో సుమారు 10 గేదెలు పాకలో ఉన్నాయి. కొన్ని పశువులు తప్పించుకోగా 4 పాడి పశువులకు గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన కాకి వీరాస్వామికి చెందిన పశువుల పాకతో పాటు, సమీపంలో ఉన్న గడ్డి వాము అగ్నికి ఆహుతైంది. గూడెం అగ్నిమాపక అధికారి కేవీఎం కొండబాబు, మండల పశువైద్యాఽధికారి పి.అశోక్‌కుమార్ తమ సిబ్బందితో వచ్చి కాలిన పశువులకు వైద్యపరీక్షలు చేసారు. సిబ్బంది మంటలను అదుపు చేశారు. మూడు పశువులు కోలుకుంటున్నాయని, మరో పశువు 90 శాతం పైగా కాలిపోయిందని, వైద్యాధికారి అశోక్‌కుమార్ తెలిపారు.


