తమ్ముడు కాకపోయినా తలకొరివి
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని బ్రాడీపేటకు చెందిన కొరటాని శ్రీను (45) అనారోగ్యంతో బాధపడుతూ శనివారం మృతి చెందాడు. బంధువులు ఉన్నా ఎవరింటికీ వెళ్లడు. పొరుగున ఉండే పతివాడ మావుళ్లమ్మను అక్కా అని పిలిచేవాడు. ఆ అనుబంధంతో ఆమె తలకొరివి పెట్టింది. తాను ప్రైవేటు ఆసుపత్రిలో పనిచేసి వయసు మీదపడడంతో మానేశానని.. శ్రీనును ఇంటి వద్దే పెట్టుకుని చూసుకునేదాన్నని మావుళ్లమ్మ తెలిపింది. శ్రీనుకు ఇద్దరు అక్కలున్నట్లు సమాచారం. శనివారం శ్రీను మృతి చెందడంతో కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చినా రాలేదని.. తలకొరివి పెట్టడానికి ఎవరూ ముందుకు రాకపోవడంతో తానే పెట్టినట్లు ఆమె తెలిపింది.


